Pakistans Richest Hindu: పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు ఇతడే..! బిజినెస్ దిగ్గజం కాదు, పారిశ్రామికవేత్త కాదు.. మరి ఎవరు.. నికర ఆస్తి ఎంత?

పాకిస్తాన్‌లో ఇస్లాం తర్వాత హిందూ మతం రెండవ అతిపెద్ద మతం. 2023 డేటా ప్రకారం పాకిస్తాన్‌లో దాదాపు 52 లక్షల మంది హిందువులు ఉన్నారు.

Pakistans Richest Hindu: పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు ఇతడే..! బిజినెస్ దిగ్గజం కాదు, పారిశ్రామికవేత్త కాదు.. మరి ఎవరు.. నికర ఆస్తి ఎంత?

Updated On : November 22, 2025 / 8:03 PM IST

Pakistans Richest Hindu: పాకిస్తాన్ చాలా చిన్న దేశం. భారత్ తో పోలిస్తే చిన్న ఆర్థిక వ్యవస్థ కలిగుంది. అక్కడ ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, శివ్ నాడార్, అజీమ్ ప్రేమ్‌జీ, నారాయణ మూర్తి వంటి బిలియనీర్ వ్యాపార దిగ్గజాలు, అత్యంత ధనవంతులైన వ్యక్తులు లేరు.

పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు..
పాకిస్తాన్ జనాభాలో కొద్దిమంది మాత్రమే ధనవంతులు. అందులో కొంతమంది హిందూ మైనారిటీకి చెందిన వారు కూడా ఉన్నారు. పాకిస్తాన్‌లో ధనవంతులు ఉన్నప్పటికీ, వారిలో కొద్దిమంది మాత్రమే హిందూ సమాజం నుండి వచ్చారు. పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతులైన హిందువుగా పరిగణించబడే వారిలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, నటుడు దీపక్ పెర్వానీ ఒకరు.

ఎవరీ దీపక్ పెర్వానీ?
1974లో మీర్పూర్ ఖాస్ నగరంలోని సిందీ హిందూ కుటుంబంలో జన్మించిన దీపక్ పెర్వానీ ఒక పాకిస్తానీ నటుడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అనేక ప్రశంసలు అందుకున్నారు. 1996లో ఫ్యాషన్ లేబుల్ DP (దీపక్ పెర్వానీ) కింద ప్రసిద్ధ బ్రైడల్, ఫార్మల్ వేర్ కోచర్ హౌస్‌ను ప్రారంభించారు.

2014 బల్గేరియన్ ఫ్యాషన్ అవార్డ్స్ లో ఉత్తమ ఫ్యాషన్ డిజైనర్‌గా(6వ స్థానం) ఎంపికయ్యారు. ఏడు లక్స్ స్టైల్ అవార్డులు, ఐదు BFA అవార్డులు, ఇండస్ స్టైల్ గురు అవార్డులను గెలుచుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కుర్తాను డిజైన్ చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కూడా కలిగున్నారు దీపక్ పెర్వానీ.

ఈ పాకిస్తానీ డిజైనర్ భారతీయ గేయ రచయిత జావేద్ అక్తర్, ఆయన భార్య నటి షబానా అజ్మీతో సహా ప్రముఖులకు దుస్తులను డిజైన్ చేశారు. చైనా , మలేషియాకు పాకిస్తాన్ సాంస్కృతిక రాయబారిగా కూడా పని చేశారు.

పెర్వానీ పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్..

ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ పేరు గడించిన దీపక్ పెర్వానీ.. తన పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కలిగి ఉన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కుర్తాను డిజైన్ చేసినందుకు దీపక్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకున్నారు. వరల్డ్ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్‌గానే కాదు.. నటనలోనూ దీపక్ మెరిశారు. అనేక సినిమాల్లో నటించారు. తన పేరుతో అనేక టీవీ షోలు నిర్వహించారు.

దీపక్ పెర్వానీ నికర విలువ..
దీపక్ పెర్వానీ సంపద గురించి అధికారిక సమాచారం లేనప్పటికీ… 2022 మీడియా నివేదిక ప్రకారం ఆయన నికర విలువ దాదాపు రూ. 71 కోట్లు. దీంతో పాకిస్తాన్‌లోని అత్యంత ధనవంతుడైన హిందువులలో ఒకరిగా దీపక్ పెర్వానీ నిలిచారు.

దీపక్ పెర్వానీ మాత్రమే కాదు ఆయన కజిన్ నవీన్ పెర్వానీ కూడా పాకిస్తాన్ లోని అత్యంత ధనవంతులైన హిందువులలో ఒకరు. ఆయన ప్రసిద్ధ స్నూకర్ ప్లేయర్. ప్రపంచవ్యాప్తంగా అనేక టోర్నమెంట్లలో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించారు. నవీన్ పెర్వానీ దాదాపు రూ. 60 కోట్ల నికర విలువ కలిగి ఉన్నారు.

పాకిస్తాన్‌లో హిందువుల జనాభా ఎంత?
పాకిస్తాన్‌లో ఇస్లాం తర్వాత హిందూ మతం రెండవ అతిపెద్ద మతం. 2023 డేటా ప్రకారం పాకిస్తాన్‌లో దాదాపు 52 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఇది దేశ మొత్తం జనాభాలో 2.17 శాతం. పాకిస్తాన్‌లో అత్యధికంగా హిందువులు (49,01,107) సింధ్ ప్రావిన్స్‌లో ఉన్నారు.

Also Read: ఆ కేసులో.. బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో అరెస్ట్..