Meghnad Saha: నోబెల్ విస్మరించిన భారతీయుడు.. అనేకసార్లు నామినేట్ అయినా..

నోబెల్ బహుమతి కోసం ఎక్కువ సార్లు నామినేట్ చేయబడి గెలుపొందలేకపోయిన భారతీయుడు ఎవరో తెలుసా? చదవండి.

Meghnad Saha: నోబెల్ విస్మరించిన భారతీయుడు.. అనేకసార్లు నామినేట్ అయినా..

Meghnad Saha

Updated On : November 10, 2023 / 5:04 PM IST

Meghnad Saha : ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి అందుకోవడానికి అర్హత ఉండి అందుకోలేకపోయిన వారిలో మహాత్మాగాంధీతో పాటు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఉన్నారు. ఆయనే మేఘనాధ్ సాహా. అనేకసార్లు నామినేట్ చేయబడినప్పటికీ ఆయన నోబెల్ ఎందుకు గెలవలేదు? చదవండి.

Iranian Nobel laureate Narges Mohammadi : నోబెల్ బహుమతి గ్రహీత నర్గెస్ జైలులో నిరాహార దీక్ష…ఎందుకంటే…

2001 లో నోబెల్ అంగీకరించిన అతి పెద్ద తప్పిదాలలో ఒకటి మహాత్మాగాంధీకి నోబెల్ ప్రదానం చేయకపోవడం.. పురాతన భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాధ్ సాహాను విస్మరించడం. తను చదువుకున్న స్కూలు, కాలేజీలో వివక్షను ఎదుర్కున్న శాస్త్రవేత్త మేఘనాధ్ సాహా. ఖగోళ శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలో ఒకరుగా నిలిచినా నోబెల్ అందుకోలేకపోయారు.

1893 లో మేఘనాధ్ సాహా ఢాకాలోని బెంగాలీ కుటుంబంలో పెరిగారు. ఆయన ఓ కిరాణా వ్యాపారి కుమారుడు. కాలేజీ విద్యార్ధిగా ఉన్నప్పుడు సాహా కుల వివక్షను ఎదుర్కున్నారు. స్వదేశీ ఉద్యమంలో భాగమైనందుకు ఆయన పాఠశాలను వదిలివేయాల్సి వచ్చింది. ఎన్నో అడ్డంకులు ఎదుర్కుని అలహాబాద్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యారాయన.

Amartya Sen Death News: నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ మరణించారా? వాస్తవం ఏంటంటే?

సాహా నక్షత్రాలలో జరిగే మార్పులు, ఉష్ణోగ్రత, పీడనం లాంటి ఎన్నో ధర్మాల్ని ఆవిష్కరించే సమీకరణాలను కనుగొన్నారు. దీనిని అమెరికన్ శాస్త్రవేత్త ఇర్వింగ్ లాంగ్‌ముయిర్ మరింత అభివృద్ధి చేశారు. సాహా 1930, 1939, 1940, 1951, 1955, 1956 లలో నోబెల్‌కు నామినేట్ అయ్యారు కానీ గెలవలేకపోయారు. ఇన్నిసార్లు నామినేట్ అయినా నోబెల్ విస్మరించబడిన భారతీయుడిగా మేఘనాధ్ సాహా 1956 లో మరణించడం విచారకరం.