Microsoft Fires Employees : మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బిగ్ షాక్.. 10వేల మంది ఔట్.. గూగుల్, ఫేస్‌బుక్ బాటలో మైక్రోసాఫ్ట్

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం ఈ జాబితాలో చేరింది. మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది.

Microsoft Fires Employees : మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బిగ్ షాక్.. 10వేల మంది ఔట్.. గూగుల్, ఫేస్‌బుక్ బాటలో మైక్రోసాఫ్ట్

Updated On : January 22, 2023 / 1:06 AM IST

Microsoft Fires Employees : ఉద్యోగులకు గడ్డు కాలం కొనసాగుతోంది. పలు కంపెనీలు తమ ఉద్యోగులకు షాక్ ఇస్తున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, ట్విటర్, మెటా తదితర దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం ఈ జాబితాలో చేరింది. మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది.

Also Read..Indian Employees: ఇండియాలో ఉద్యోగులకు 15-30 శాతం పెరగనున్న వేతనాలు.. తాజా సర్వే వెల్లడి

మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. 10వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 5శాతం కావడం గమనార్హం. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఉద్యోగులకు మెయిల్ చేశారు. స్థూల ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తులో కొత్త అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Also Read..Amazon Lay Off Employees : ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్.. భారత్ లో 1000 మంది

ఈ 10వేల మందిలో కొందరు వెంటనే ఇంటికి పోవాల్సి ఉంటుంది. మిగతా ఉద్యోగుల తొలగింపు రానున్న కొన్ని రోజులు, నెలల్లో ఉంటుంది. టెక్ పరిశ్రమలో స్లో డౌన్ ఉండటమే ఉద్యోగుల తొలగింపునకు కారణంగా తెలుస్తోంది.

భవిష్యత్తులో ఎదురు కానున్న భయాలను దృష్టిలో పెట్టుకుని పలు దిగ్గజ కంపెనీలు.. లాభాల్లో ఉన్నప్పటికి.. ముందు జాగ్రత్తగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, ఫేస్ బుక్ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడీ జాబితాలోకి మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అవకాశాలపై ఫోకస్ చేసేందుకు ఈ నిర్ణయం తప్పలేదని సత్య నాదెళ్ల అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.