Indian Employees: ఇండియాలో ఉద్యోగులకు 15-30 శాతం పెరగనున్న వేతనాలు.. తాజా సర్వే వెల్లడి

సగటున 9.8 శాతం పెరుగుదల ఉంటుంది. కార్న్ ఫెర్రీ సంస్థ మన దేశంలోని 818 సంస్థలను సర్వే చేసి ఈ విషయాలు వెల్లడించింది. ఈ సంస్థ సర్వే చేసిన కంపెనీలు మొత్తంగా 8,00,000 ఉద్యోగాల్ని కల్పిస్తున్నాయి. మన దేశంలో సగటున 9.8 శాతం పెరుగుదల ఉండొచ్చు.

Indian Employees: ఇండియాలో ఉద్యోగులకు 15-30 శాతం పెరగనున్న వేతనాలు.. తాజా సర్వే వెల్లడి

Indian Employees: దేశంలోని ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిందో సర్వే సంస్థ. ఇండియాలో ఈ ఏడాది కీలక రంగాల్లోని ఉద్యోగులకు 15-30 శాతం వేతనాలు పెరిగే అవకాశం ఉందని ‘కార్న్ ఫెర్రీ’ అనే సంస్థ వెల్లడించింది. అత్యంత ప్రతిభావంతులకు ఈ స్థాయిలో పెరుగుదల ఉంటుందని ఈ సర్వే తేల్చింది.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం: వైసీపీ నేత, నటుడు అలీ

సగటున 9.8 శాతం పెరుగుదల ఉంటుంది. కార్న్ ఫెర్రీ సంస్థ మన దేశంలోని 818 సంస్థలను సర్వే చేసి ఈ విషయాలు వెల్లడించింది. ఈ సంస్థ సర్వే చేసిన కంపెనీలు మొత్తంగా 8,00,000 ఉద్యోగాల్ని కల్పిస్తున్నాయి. కార్న్ ఫెర్రీ సర్వే ప్రకారం.. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే మన దేశంలోని ఉద్యోగులకే వేతనాల పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మన దేశంలో సగటున 9.8 శాతం పెరుగుదల ఉండొచ్చు. గత ఏడాది 9.4 శాతం వేతనాల పెరుగుదల మాత్రమే కనిపించింది. హై టెక్నాలజీ పరిశ్రమలు, సంస్థలు, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లోని ఉద్యోగులకు ఎక్కువ వృద్ధి ఉంటుంది. ఈ రంగాల్లోని ఉద్యోగులకు కనీసం 10 శాతం కంటే ఎక్కువ వేతనాల పెరుగుదల ఉంటుంది.

Rohit Sharma: వరల్డ్ కప్‌ కోసం బలమైన జట్టు తయారు చేయడమే లక్ష్యం: భారత కెప్టెన్ రోహిత్ శర్మ

ఆస్ట్రేలియాలో సగటున 3.5 శాతం, చైనాలో 5.5 శాతం, హాంకాంగ్‌లో 3.6 శాతం, ఇండోనేసియాలో 7 శాతం, కొరియాలో 4 శాతం, మలేసియాలో 5 శాతం, న్యూజిలాండ్‌లో 3.8 శాతం, ఫిలిప్పీన్స్‌లో 5.5 శాతం, సింగపూర్‌లో 4 శాతం, థాయ్‌లాండ్‌లో 5 శాతం, వియత్నాంలో 8 శాతం వేతనాల పెరుగుదల ఉంటుంది. మన దేశంలో కంపెనీలు 60 శాతం ఉద్యోగుల్ని హైబ్రిడ్ పద్ధతిలో పని చేయించుకుంటున్నాయి. ఇండియా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అందువల్ల మన దేశంలో వేతనాల పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.