Maryland Lottery : ఉబెర్ డ్రైవర్‌కు రూ. 75 లక్షల లాటరీ!

ఉబెర్ డ్రైవర్ గా కొనసాగుతూ..కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఓ వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. లాటరీ రూపంలో భారీగా డబ్బు రావడంతో..అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Maryland Lottery : ఉబెర్ డ్రైవర్‌కు రూ. 75 లక్షల లాటరీ!

Middle River

Updated On : October 26, 2021 / 8:40 PM IST

Middle River Rideshare Driver : ఉబెర్ డ్రైవర్ గా కొనసాగుతూ..కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఓ వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. లాటరీ రూపంలో భారీగా డబ్బు రావడంతో..అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. చిన్న..చితకా డ్రైవర్ గా ఉంటూ వస్తున్న వారికి లాటరీ తగిలితే..ఆ సంతోషమే వేరు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. 69 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి ఉబెర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడుతున్నాడు.

Read More : Udaipur Teacher : పాక్ గెలిచిందని సంబరాలు చేసుకున్న టీచర్..ఉద్యోగం కోల్పోయింది

అయితే..ఇతనికి లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం అలవాటు ఉంది. జోప్పాలోని ఓ దుకాణం వద్ద 10 డాలర్లతో లాటరీ టిక్కెట్ ను కొనుగోలు చేస్తుండే వాడు. అలాగే..అనుకోకుండా..వేయి డాలర్లు వెచ్చించి పెద్ద లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. అందులో ఓ లాటరీ టికెట్ ను స్క్రాచ్ చేయగా..లక్ష డాలర్లు (రూ. 75 లక్షలు) వచ్చినట్లు ఉంది. దీనిపై అతను స్పందించాడు.

Read More : Taiwanese maths teacher : అశ్లీల వెబ్ సైట్ లో లెక్కల పాఠాలు చెబుతూ కోట్లు సంపాదిస్తున్న టీచర్

సంతోషం పట్టలేకపోయానని, కేకలు వేయడంతో పక్కనే ఉన్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి వచ్చి…బాగానే ఉన్నావా అంటూ విచిత్రంగా చూశాడని తెలిపాడు. తనకు లాటరీలో ఎంత తగిలిందో చూడు అంటూ చూపించానని వెల్లడించాడు. తాను మేరీల్యాండ్ లాటరీ టికెట్ కంపెనీకి ఉబెర్ డ్రైవర్ గా ఐదేళ్లు నుంచి పని చేయడమే కాకుండా…24 వేల రైడ్లకు పైగా చేశానన్నాడు. కొంత డబ్బును తన కారును బాగు చేయించుకోవడానికి ఖర్చు పెడుతానని ఆ వ్యక్తి తెలిపాడు.