United Nations: అది మీ మంత్రినే అడగాలి.. పాకిస్తాన్ జర్నలిస్టుతో కేంద్రమంత్రి జయశంకర్

'భారత్‌ కంటే ఉగ్రవాదాన్ని ఏ దేశమూ మెరుగ్గా ఉపయోగించుకోలేదు' అని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ ఇటీవల చేసిన ఆరోపణపై అడిగిన ప్రశ్నకు జైశంకర్‌ సమాధానమిస్తూ "ప్రపంచం ఈరోజు వారిని (పాకిస్తాన్) ఉగ్రవాదానికి కేంద్రంగా చూస్తోంది. కాబట్టి, వారు బయటికి చెప్పే ఫాంటసీలను వదిలేసి ముందు తమను తాము గుర్తు చేసుకోవాల్సిన అవసరముందని నేను చెబుతాను" అని అన్నారు

United Nations: అది మీ మంత్రినే అడగాలి.. పాకిస్తాన్ జర్నలిస్టుతో కేంద్రమంత్రి జయశంకర్

Minister Jaishankar's Response To Pak Journalist About Terrorism

Updated On : December 16, 2022 / 3:41 PM IST

United Nations: పాకిస్థాన్‌ను ఉగ్రవాదానికి కేంద్రంగా ప్రపంచం చూస్తోందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం అన్నారు. కోవిడ్-19 అనే పొగమంచు రెండేళ్లకు పైగా ప్రేరేపించినప్పటికీ, ఉగ్రవాదం ఎక్కడి నుంచి ఉద్భవించిందో అంతర్జాతీయ సమాజం మరచిపోలేదని ఆయన నొక్కి చెప్పారు. ‘గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం అప్రోచ్: ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి కౌన్సిల్‌లో భారత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం అనంతరం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్టేక్‌అవుట్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు.

MP Shashi Tharoor: కదలలేని స్థితిలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ .. ట్విటర్‌లో ఫొటోలు షేర్ చేసిన ఎంపీ

‘భారత్‌ కంటే ఉగ్రవాదాన్ని ఏ దేశమూ మెరుగ్గా ఉపయోగించుకోలేదు’ అని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ ఇటీవల చేసిన ఆరోపణపై అడిగిన ప్రశ్నకు జైశంకర్‌ సమాధానమిస్తూ “ప్రపంచం ఈరోజు వారిని (పాకిస్తాన్) ఉగ్రవాదానికి కేంద్రంగా చూస్తోంది. కాబట్టి, వారు బయటికి చెప్పే ఫాంటసీలను వదిలేసి ముందు తమను తాము గుర్తు చేసుకోవాల్సిన అవసరముందని నేను చెబుతాను” అని అన్నారు. పాకిస్తాన్‭లో ఉగ్రవాదాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘మీ పెరట్లో పాముల్ని పెంచుకోవడం మీక్కూడా నష్టమే ఉంటుంది. ఎందుకంటే అవి పొరుగు వారిని మాత్రమే కాటేస్తాయని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు’’ అని అన్నారు.

Delhi: టీచర్ అరాచకం.. 5వ క్లాస్ విద్యార్థినిపై కత్తెర్లతో దాడి చేసి, ఆపై బాల్కనీ నుంచి తోసేసింది

ఇక న్యూఢిల్లీ, కాబూల్, పాకిస్తాన్ ప్రాంతాల నుంచి ఉగ్రవాదం వ్యాప్తి చెందడాన్ని దక్షిణాసియా ఇంకెన్నాళ్లు చూస్తుందని ఒక పాకీస్తానీ జర్నలిస్టు ప్రశ్నించారు. దీనికి జయశంకర్ సమాధానం చెప్తూ ‘‘అది మీకే తెలుస్తుంది. బహుశా మీరు తప్పుడు మంత్రిని ప్రశ్నించారు. ఈ ప్రశ్న మీ దేశ (పాకిస్తాన్) మంత్రిని అడగాల్సింది. ఎందుకంటే పాకిస్తాన్ ఇంకెంత కాలం ఉగ్రవాదాన్ని ఎగదోస్తుందనేది మాకెలా తెలుస్తుంది?’’ అని ప్రశ్నించారు. ప్రపంచమేమీ పిచ్చిది కాదని, ఏదో ఒకరోజు దీనికి (పాక్ ఉగ్రవాదానికి) ముగింపు పడక తప్పదని జయశంకర్ అన్నారు.