Miss World 2021: మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని సొంతం చేసుకున్న పోలాండ్ బ్యూటీ కరోలినా బిలావ్స్కా
మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు పోలాండ్ బ్యూటీ కరోలినా బిలావ్స్కా.

Miss World 2021..karolina Bielawska From Poland (1)
Miss World 2021..Karolina Bielawska from Poland : ప్యూర్టోరికోలో జరిగిన 70వ ప్రపంచ సుందరి పోటీల్లో పోలాండ్ కు చెందిన కరోలినా బిలావ్స్కా కిరీటాన్ని దక్కించుకున్నారు.ఈ పోటీల్లో పాల్గొన్న తెలుగమ్మాయి మానసా వారణాసి కూడా ఎంతో కష్టపడి సెమీ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. మిస్ వరల్డ్ 2021 పోటీలు డిసెంబర్‌లోనే జరగాల్సి ఉన్నా.. కోవిడ్ వల్ల వాయిదా పడ్డాయి. ఇక 70వ మిస్ వరల్డ్‌గా కిరీటాన్ని దక్కించుకున్న కరోలినాబిలావ్స్కా కు అందరూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తరువాత మొదటి రన్నర్ అప్‌గా అమెరికాకు చెందిన శ్రీ సైనీ నిలువగా..సెకండ్ రన్నర్ అప్‌గా కాట్ లివోరీ దేశానికి చెందిన ఒలీవియా ఏస్ నిలిచారు..
Also read : Miss Universe 2021 : భారతీయురాలికి మిస్ యూనివర్స్ టైటిల్
మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకొని మిస్ వరల్డ్ కూడా కావాలనుకున్న మానసా వారణాసి ఫైనల్స్ వరకూ కూడా చేరుకోలేకపోయింది. సెమీ ఫైనల్స్‌లో టాప్ 13 కంటెస్టెంట్స్‌లో తాను కూడా ఒకటిగా నిలిచిపోయింది. కానీ మిస్ వరల్డ్ పోటీల్లో సెమీ ఫైనల్స్ వరకూ వెళ్లడం కూడా మాటలు కాదు.
ఈ పోటీల్లో ప్రపంచ సుందికిగా ఎన్నికైన కరోలినా ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని కొనసాగిస్తోంది.పీహెచ్‌డీతో చేయాలనుకుంటున్నారట. కరోలినా మోడల్‌గా కూడా పనిచేస్తున్నారు. అంతేకాదు స్విమ్మింగ్,స్కూబా డైవింగ్,టెన్నిస్,బ్యాడ్మింటన్ ఆడటం అంటే చాలా చాలా ఇష్టమట.
69వ మిస్ వరల్డ్..టోనీ-ఆన్ సింగ్ కిరీటం పొందిన తరువాత కరోలినా తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యారు. కన్నీటితో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సంతోష సమయంలో కరోలినా మాట్లాడుతూ..“విన్నర్ నా పేరు వినగానే నేను షాక్ అయ్యాను, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ప్రపంచ సుందరి కిరీటాన్ని ధరించడం నాకు గౌరవంగా ఉంది.ఇది నా జీవితంలో మరచిపోలేని ఘట్టం అని నేను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తంచేశారు కరోలినా..