PM Modi France visit: ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఆ దేశ ప్రధాని
శుక్రవారం జరగనున్న ఫ్రాన్స్ బస్టీల్ డే వేడుకల్లో గౌరవ అతిథిగా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే మిలటరీ పరేడ్‌లో ఫ్రాన్స్ దేశ బలగాలతో కలిసి భారత దళాలు కూడా పాల్గొనబోతున్నాయి.

PM Modi France visit: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్‌లో అడుగుపెట్టిన ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ స్వయం విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. తాను ఫ్రాన్స్ చేరుకున్నట్లుమోదీ ట్వీట్ ద్వారా తెలిపారు. అక్కడ విమానాశ్రయంలో దిగుతున్న ఫొటోలు, ఆయనకు గౌరవ వందనం ఇచ్చిన ఫొటోలను ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
ఇక శుక్రవారం జరగనున్న ఫ్రాన్స్ బస్టీల్ డే వేడుకల్లో గౌరవ అతిథిగా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే మిలటరీ పరేడ్‌లో ఫ్రాన్స్ దేశ బలగాలతో కలిసి భారత దళాలు కూడా పాల్గొనబోతున్నాయి. రక్షణ, అంతరిక్ష, మౌలిక, సాంస్కృతిక రంగాలతోపాటు వివిధ విభాగాల్లో భారత్-ఫ్రాన్స్ బంధాల బలోపేతమే లక్ష్యంగా ఆ దేశ ప్రెసిడెంట్ ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. దీనికి సంబంధించి రెండు నెలల క్రితమే మెక్రాన్ ఆహ్వానం పలికారు.
Landed in Paris. Looking forward to boosting India-France cooperation during this visit. My various programmes today include an interaction with the Indian community later in the evening. pic.twitter.com/2rBClUL0zJ
— Narendra Modi (@narendramodi) July 13, 2023
శుక్రవారం సాయంత్రం ఫ్రాన్స్ సెనేట్ అధ్యక్షుడు గెరాడ్ లార్చర్‌తో భేటీ కానున్నారు. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 11 గంటలకు ప్రవాస భారతీయుల సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ఎలీసీ ప్యాలెస్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయేల్ మెక్రాన్ ఏర్పాటు చేసే ప్రైవేట్ విందులో పాల్గొననున్నారు. మరోవైపు భారత నేవీ కోసం ఫ్రాన్స్ నుంచి 26 రాఫెళ్లు, 3 సబ్‌మెరైన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం మోదీ పర్యటన సందర్భంగా కుదిరే సూచనలున్నట్లు తెలుస్తోంది.