PM Modi-Donald: మోదీ, ట్రంప్ భేటీలో ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందాలు.. భారత రక్షణరంగాన్ని మరింత బలోపేతం చేసేలా ప్రకటన

వైట్ హౌస్ లో ట్రంప్, మోదీ ఒద్దరూ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు.

PM Modi-Donald: మోదీ, ట్రంప్ భేటీలో ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందాలు.. భారత రక్షణరంగాన్ని మరింత బలోపేతం చేసేలా ప్రకటన

PM Modi-Donald Trump

Updated On : February 14, 2025 / 10:29 AM IST

PM Modi-Donald Trump Meeting: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఫ్రాన్స్ నుంచి అమెరికా చేరుకున్న మోదీ.. వాషింగ్టన్ లో దేశాధ్యక్షుడి అతిథిగృహమైన బ్లేయర్ హౌస్ లో బస చేశారు. అనంతరం వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై వారు చర్చించారు. వాణిజ్యం, భద్రత సహా పలు ఇతర అంశాలపై వీరిమధ్య చర్చకు వచ్చాయి. భారత్, అమెరికా దేశాల మధ్య అద్భుతమైన స్నేహ సంబంధాలున్నాయని, రాబోయే నాలుగేళ్ల కాలంలోనూ ఆ సంబంధాలు అలాగే కొనసాగుతాయని ట్రంప్ తెలిపారు.

Also Read: Donald Trump: మోదీ అమెరికా పర్యటనలో ఉండగానే.. ఇండియాకు బిగ్ షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్..! అదేమిటంటే..

వైట్ హౌస్ లో ట్రంప్, మోదీ ఒద్దరూ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారు. అందరూ ఆ విషయమే మాట్లాడుకుంటున్నారు. మోదీ నిజంగా గొప్ప నాయకుడు అంటూ ట్రంప్ అన్నారు. గతంకంటే రాబోయే నాలుగేళ్లు మేమిద్దరం కలిసి పనిచేస్తామని మోదీ అన్నారు. రెండు దేశాలు కలిసికట్టుగా ఉన్నాయని ఇద్దరు నేతలు పేర్కొన్నారు.

Also Read: Narendra Modi: ఎలాన్ మస్క్ ముగ్గురు పిల్లలతో ప్రధాని మోదీ ముచ్చట్లు.. ఫొటోలు, వీడియో వైరల్ .. మోదీకి మస్క్ స్పెషల్ గిఫ్ట్

డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ భేటీలో ఇండియా, అమెరికా దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం ట్రంప్, మోదీ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ట్రంప్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఒప్పందాలపై వివరాలు వెల్లడించారు. రెండు దేశాల మధ్య అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాం. అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్ ను భారత్ మరింతగా కొనుగోలు చేస్తుందని ట్రంప్ తెలిపారు. మోదీ మాట్లాడుతూ.. అమెరికాలో చమురు, గ్యాస్ వాణిజ్యంపై దృష్టిపెడతామని, 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే మా లక్ష్యం అని తెలిపారు.

 

సరిహద్దుల్లో చైనాతో ముప్పు పొంచిఉన్న వేళ భారత రక్షణరంగాన్ని మరింత బలోపేతం చేసేలా ట్రంప్, మోదీ మధ్య కీలక చర్చలు జరిగాయి. భారత్ కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతామని, అధునాతన ఎఫ్-31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. లక్షల డాలర్ల విలువైన సైనిక పరికరాలను భారత్ కు విక్రయించేందుకు అమెరికా ప్రణాళికలు రూపొందిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.

26/11 ముంబయి ఉగ్రదాడి సూత్రదారి తహవూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.