భయాందోళనలో అమెరికన్లు: 9/11 ఉగ్రదాడి మరణాల కన్నా…కరోనా మృతులే ఎక్కువ

అగ్రరాజ్యంపై కరోనా(COVID-19) మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు అమెరికన్లు వణికిపోతున్నారు. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడం ఆందోళనకరంగా పరిణమించింది.న్యూయార్క్ లో 75,983 కేసులు నమోదు అవగా,న్యూజెర్సీలో 18,696 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 865 కరోనా మరణాలు నమోదయ్యాయని మేరీల్యాండ్ లోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. ఇద్దరు భారతీయులు కూడా కరోనా కాటుకు బలయ్యారు.
వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనా కన్నా మరణాల సంఖ్యలో,కేసుల సంఖ్యలో అమెరికానే ముందుంది. అయితే గత శనివారం 2010 కరోనా మరణాలు నమోదవగా,రెండు రోజుల్లోనే మరణాల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువ అయింది. కరోనా పురుడు పోసుకున్న చైనా.. కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన ఇటలీ, స్పెయిన్‌ల కంటే కూడా అమెరికాలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం అమెరికన్లలో ఆందోళన కలిగిస్తొంది.
అయితే ఇక్కడ మరో కొత్త విషమేమిటంటే, అల్ ఖైదా ఉగ్రసంస్థ అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న జరిపిన ఉగ్రదాడుల్లో మరణించిన వారిసంఖ్య కంటే ఈ కరోనా మహమ్మారి కారణంగా మరణించిన అమెరికన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ,పెంటగాన్ పై జరిగిన 9/11 ఉగ్రదాడిలో 2977మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. 25వేలమంది గాయపడ్డారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 4వేల 55మంది అమెరికన్లు మరణించారు.అంతేకాకుండా వైరస్ బాధితుల సంఖ్య 1లక్షా 88వేల 578గా ఉంది. అమెరికా గడ్డపై జరిగిన ఉగ్రదాడుల్లో అకస్మాత్తుగా మరణించిన వారి కన్నా కరోనా వైరస్ కారణంగానే ఎక్కువమంది చనిపోయారు.
మరోవైపు అమెరికా ఆర్థికవ్యవస్థ పరిస్థితి కూడా అలాగే ఉంది. 9/11 ఎటాక్ త్వారత మూడు నెలల్లో ప్రతినెలా 1లక్షా 43వేల ఉద్యోగాలను అమెరికా ఎకానమీ కోల్పోయింది. అంతేకాకాకుండా 2.8 బిలియన్ డార్ల వేతనాలను కూడా కోల్పోయినట్లు 2004నాటి న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చెబుతుంది. అయితే ఉగ్రదాడిలో కోల్పోయినదానికన్నా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా అమెరికా ఎకానమీ ఎక్కువ కోల్పోనుంది.
కరోనా కారణంగా అమెరికాలోని వివిధ సెక్టార్ లలో భారీగా ఉద్యోగుల తొలగింపు(massive layoffs)ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఊహించని కరోనా కారణంగా అమెరికాలో రాబోయే రోజుల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు ఉంటుందన్న విశ్లేషణలతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవారిలో ఆందోళన నెలకొంది. ఓ అంచనా ప్రకారం….దాదాపు 4.7కోట్ల మంది నిరుద్యోగులుగా మారనున్నారు. అయితే ఇప్పటికే అమెరికాలో లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం. అమెరికాలో ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అమెరికా దీన్ని బయటపడేందుకు ఇంకా చాలారోజులు పట్టేట్లు కనిపిస్తోంది.
అమెరికా కరోనాతో పూర్తిస్థాయిలో పోరాడుతోందని… అయితే మహమ్మారి ధాటికి 2,40,000 అమెరికన్లు మృత్యువాత పడే అవకాశం ఉందని వైట్ హౌస్ హెచ్చరించింది. కరోనాను కట్టడి చేసేందుకు మ్యాజిక్ వ్యాక్సిన్ గానీ.. చికిత్స గానీ లేదని… మనుషుల ప్రవర్తన, క్రమశిక్షణ మీదే కరోనా వ్యాప్తి ఆధారపడి ఉంటుందని తెలిపింది. కాబట్టి ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. రాబోయే రెండు వారాలు తీవ్రమైన బాధను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్లేగు వంటిది. ప్రతీ అమెరికా పౌరుడు కరోనా, దాని వల్ల ఎదురయ్యే కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అన్నారు.