Morocco earthquake: 820కి పెరిగిన మృతుల సంఖ్య.. ప్రశాంతంగా ఉన్న ప్రాంతం ఒక్క క్షణంలో ఎలా మారిందో చూడండి..
ప్రజల పరుగులు, కేకలు, ప్రాణాలు కాపాడుకోవడం కోసం తహతహలాడే దృశ్యాలు కనపడ్డాయి.

Morocco earthquake
Morocco earthquake – Video: మొరాకోలో గత రాత్రి 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల సంభవించిన మరణాల సంఖ్య 820కి పెరిగింది. వందలాది మంది గాయాలపాలయ్యారు. భూకంపం సంభవించిన ప్రాంతంలో ఎక్కడచూసినా ప్రజల హాహాకారాలు వినపడ్డాయి, రక్తపు మడుగులు కనపడ్డాయి.
భూకంపం రాక ముందు వరకు చాలా ప్రశాంతంగా కనపడిన ఆ ప్రాంతమంతా.. అనంతరం ప్రజల పరుగులు, కేకలు, ప్రాణాలు కాపాడుకోవడం కోసం తహతహలాడే దృశ్యాలు కనపడ్డాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో మీడియాకు చిక్కింది. భూకంపం రావడంతో మొదట భవనాలు ఊగిపోయాయి.
క్షణాల వ్యవధిలోనే కుప్పకూలాయి. సెంట్రల్ మొరాకోలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ పేర్కొంది. భూకంప కేంద్రం అట్లాస్ పర్వాతల్లో, మారకేశ్‌కు నైరుతి వైపుగా 71 కిలోమీటర్ల దూరంలో, 18.5 కిలోమీటర్ల లోతులో ఉన్నాయని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తించిన చోట కూడా పలు భవనాలు ధ్వంసమయ్యాయి.
WATCH: 6.8-magnitude earthquake hits Morocco, killing more than 300 people pic.twitter.com/sOHj2HRSMs
— BNO News (@BNONews) September 9, 2023