Woman beat her son and daughter-in-law : నడిరోడ్డుపై కొడుకు-కోడల్ని కొట్టిన మహిళ.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

బైక్ మీద వెడుతున్న కొడుకు-కోడల్ని ఆపి మరీ కొట్టింది ఓ మహిళ. నడిరోడ్డుపై పోలీసులు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. ఆమె కొట్టిన కారణం తెలిస్తే మీరు కూడా ఆ మహిళను మెచ్చుకుంటారు.. ఇంతకీ ఏంటా కారణం?

Woman beat her son and daughter-in-law : నడిరోడ్డుపై కొడుకు-కోడల్ని కొట్టిన మహిళ.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Woman who beat her son and daughter-in-law

Updated On : May 14, 2023 / 2:29 PM IST

Woman fight on the road : ఎంత వయసు వచ్చినా పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు. అదే పని చేసింది ఓ మహిళ. కొడుకు-కోడలు చేసిన మిస్టేక్‌కి రోడ్డుపైనే గొడవ పడింది. ఇంతకీ అసలు ఏం జరిగింది?

Delhi : బైకుల్లో పెట్రోల్ తీసి నిప్పు పెట్టి బైకుల్ని కాల్చేస్తున్న మహిళ .. ఎందుకలా చేస్తోంది?

హెల్మెట్ ధరించలేదని కొడుకు-కోడల్ని రోడ్డుపై కొట్టింది ఓ మహిళ. @iammaya_sharma అనే ట్విట్టర్ యూజర్ ద్వారా షేరైన ఈ వీడియో అందరిని ఆలోచింప చేస్తోంది. ‘హెల్మెట్ ధరించనందుకు కొడుకుకి రోడ్డుపై బుద్ధి చెప్పిన తల్లికి సెల్యూట్ చేయాలి’ అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బైక్ మీద వెళ్తున్న కొడుకు కోడల్ని పరుగున వెళ్లి ఆపింది. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని కొడుకుని కొట్టింది. కోడల్ని కూడా నిలదీసింది. ఇదంతా ప్రధాన రహదారిపై పోలీసులు చూస్తుండగానే జరిగింది. ఇక ఆ మహిళ చేసిన పనికి అందరూ ప్రశంసలు కురిపించారు.

Kanpur: ఆగి ఉన్న బైక్‌‌లను కారుతో ఢీకొట్టిన మహిళ.. వీడియో వైరల్

హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా.. ఫైన్లు వేస్తున్నా జనాలు పట్టించుకోవట్లేదు. ఇక హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి ప్రమాదాలు గురై ప్రాణాలు కోల్పోతున్నవారు.. జీవచ్చవంలా మిగులుతున్నవారు ఎందరో? జీవితాంతం తల్లిదండ్రులకు మానసిక క్షోభను మిగులుస్తున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న కొడుకుకి గుణపాఠం చెప్పిన మహిళను శభాష్ అంటున్నారు.