Asteroid Alert : నాసా హెచ్చరిక.. భూమికి అతిదగ్గరగా దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. తాజ్ మహల్‌కు 5 రెట్లు ఉంటుందట..!
NASA Alerts : ఇది మరో అతిపెద్ద గ్రహశకలం.. అక్టోబరు 28, 2024న 2020 WG గ్రహశకలం భూమికి దగ్గరగా రానుంది. దాదాపు 500 అడుగుల ఎత్తులో తాజ్ మహల్ ఎత్తుకు 5 రెట్లు ఉంటుంది.

Asteroid five times the height of Taj Mahal
NASA Alerts : నాసా హెచ్చరిక.. మరో అతిభారీ గ్రహశకలం భూమివైపు దూసుకువస్తోంది.. ఈసారి రాబోతున్న గ్రహశకలం తాజ్ మహల్ ఎత్తుకు 5 రెట్లు ఉంటుందని అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా (NASA) అంచనా వేస్తోంది. నాసా ప్రకారం.. ఈ నెల 26 నుంచి 28, 2024 మధ్య భూమికి అతిదగ్గరగా రానుంది. అందులో 2024TB2, 2007UT3 భారీ 2020 WG అనే మూడు గ్రహశకలాలు ఉన్నాయి. ప్రస్తుతానికి, ఈ ఖగోళ గ్రహశకలాల నుంచి భూమికి ఎలాంటి ముప్పు లేదని నిపుణులు ధృవీకరిస్తున్నారు. ఈ గ్రహశకలాలతో శాస్త్రీయ పరిశోధనకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
గ్రహశకలం 2020WG :
ఇది మరో అతిపెద్ద గ్రహశకలం.. అక్టోబరు 28, 2024న 2020 WG గ్రహశకలం భూమికి దగ్గరగా రానుంది. దాదాపు 500 అడుగుల ఎత్తులో తాజ్ మహల్ ఎత్తుకు 5 రెట్లు ఉంటుంది. భూమికి అత్యంత సమీపంగా వెళ్లనుంది. గంటకు 33,947 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, దాదాపు 3.33 మిలియన్ కిలోమీటర్లలోపు వస్తుందని అంచనా.
2020 WG పరిమాణం, కక్ష్య కారణంగా ప్రమాదకరమైన గ్రహశకలంగా నాసా హెచ్చరిస్తోంది. 500 అడుగుల 2020 WG గ్రహశకలం అత్యంత వినాశకరమైనదిగా నాసా చెబుతోంది. మిలియన్ల టన్నుల టీఎన్టీతో పోల్చదగిన భారీ పేలుడు శక్తిని విడుదల చేస్తుంది. ఇలాంటి గ్రహశకలాలను నాసా ఎప్పుడూ నిశితంగా పరిశీలిస్తుంటుంది. ప్రస్తుతానికి ఈ గ్రహశకలంతో భూమికి ఎలాంటి ముప్పు లేదని అంటున్నారు సైంటిస్టులు.
గ్రహశకలం 2024TB2 :
ఈ గ్రహశకలం పెద్దది కానీ సురక్షితమైనది.. 2024TB2 గ్రహశకలం అనేది సుమారు 110 అడుగులు వెడల్పు.. దాదాపు ఒక చిన్న విమానం అంతా పరిమాణంలో ఉంటుంది. అక్టోబర్ 26, 2024న సుమారు 731,000 మైళ్ల దూరంలో భూమిని సురక్షితంగా దాటిపోతుంది. చంద్రుని కక్ష్యను దాటి ప్రయాణించనుంది. నాసా ప్రకారం.. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ క్రమంలో శాస్త్రవేత్తలు ఆ గ్రహశకలాన్ని నిశితంగా అధ్యయనం చేయనున్నారు.
గ్రహశకలం 2007UT3 :
ఈ రెండో గ్రహశకలం కొద్దిగా చిన్నది అయినప్పటికీ సురక్షితమైనది కూడా. దీని పేరు 2007UT3గా పిలుస్తారు. దాదాపు 73 అడుగుల పరిమాణంలో ఉంటుంది. ఇది కూడా చిన్న విమానంతో పోల్చవచ్చు. ఈ గ్రహశకలం అక్టోబర్ 26, 2024న భూమిపై 4.2 మిలియన్ మైళ్ల దూరంలో వెళ్తుంది. టీబీ2 శకలం మాదిరిగానే ఇది ప్రమాదకరమైనది అయినప్పటికీ దాని మార్గం మన గ్రహానికి ఎలాంటి ముప్పును కలిగించదని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
నాసా విజిలెన్స్, ట్రాకింగ్ ప్రోగ్రామ్స్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా సంభావ్య ప్రమాదాలను అంచనా వేస్తుంది. నాసా వేలకొద్దీ భూమికి సమీపంలో ఉన్న వస్తువులను (NEOs) ట్రాక్ చేసి విశ్లేషిస్తుంది. ఏజెన్సీ జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) పర్యవేక్షణలో నాసా చెప్పినట్లుగా ప్రతి గ్రహశకలం గ్రహాల రక్షణకు అమూల్యమైన డేటాను అందిస్తుంది.
Read Also : Free LPG Cylinders : దీపావళికి ఫ్రీగా ఎల్‌పీజీ సిలిండర్లు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేయాలో తెలుసా?