Video: గుడ్‌న్యూస్.. అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి బయటకు సునీత విలియమ్స్.. వీడియో చూశారా?
వారు కిందకు దిగే ప్రోగ్రాంను నాసా లైవ్‌లో అందిస్తోంది.

NASA astronauts
నాసా, స్పేస్‌ఎక్స్ క్రూ -9 మిషన్‌లో వ్యోమగాములు నిక్ హేగ్, సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్, కాస్మోనాట్ అలెక్సాండర్ గోర్బునోవ్ భూమి మీదకు బయలుదేరారు. అంతరిక్ష కేంద్రాన్ని వీడిన వారు నలుగురు.. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు భూమి మీదకు వస్తారు.
క్రూ -9లో ఈ నలుగురు వ్యోమగాములు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలోకి ప్రవేశించిన తరువాత వాటిలోని ద్వారాలను సురక్షితంగా మూసివేస్తారు. హ్యాచ్ మూసివేత ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. హాచ్‌ను మూసివేసిన తరువాత క్రూ-9లోని వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరుతారు. వారు కిందకు దిగే ప్రోగ్రాంను నాసా లైవ్‌లో అందిస్తోంది. క్రూ డ్రాగన్ ప్రయాణానికి అన్ని సన్నాహాలను గత రాత్రే మొదలుపెట్టారు.
తిరుగుప్రయాణం వేళ నలుగురు వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకున్నట్లు నాసా తెలిపింది. అలాగే వారంతా అక్కడ ఫొటోలు తీసుకున్నారు. నాసా కేంద్రం ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఇవాళ ఉదయం 10.15 గంటలకు అన్‌డాకింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఐఎస్‌ఎస్ నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక విడిపోతుంది.
విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలో 286 రోజులు పూర్తి చేసుకున్నారని నాసా ఇవాళ తెలిపింది. అందులో 245 రోజులు ఐఎస్‌ఎస్‌లో ఉన్నారని వివరించింది. స్పేస్‌సూట్‌లను ధరించి వారు ఐఎస్‌ఎస్ నుంచి బయలుదేరినట్లు చెప్పింది.
Also Read: మీరూ సునీత విలియమ్స్‌లా అదరగొట్టేయాలనుకుంటున్నారా? నాసాలో ఇలా ఉద్యోగం సంపాదించుకోవచ్చు..
ఐఎస్‌ఎస్‌లో సుమారు 9 నెలల పాటు ఉండిపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ బుధవారం వేకువజామున 3.27 గంటలకు వారు ప్రయాణించే క్యాప్సూల్ అమెరికాలోని ఫ్లోరిడా సమీపంలోని సముద్రంలో దిగుతుంది. అనంతరం నలుగురు వ్యోమగాములను అక్కడి నుంచి బయటకు తీసుకువస్తారు. ఇందుకోసం అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నలుగురు వ్యోమగాములను తీసుకురావడానికి వెళ్లిన క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ గత ఆదివారం ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమైన విషయం తెలిసిందే. ఇందులో వెళ్లిన మరో నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లో బాధ్యతలను స్వీకరించారు. కాగా, 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. అక్కడ 8 రోజులు ఉండాల్సిన వారిద్దరు స్టార్‌లైనర్‌లో సమస్యల కారణంగా ఇన్ని నెలలు ఉండాల్సి వచ్చింది.