కొత్త కేన్సర్ ట్రీట్ మెంట్ : ఒక Light చాలు.. ట్యూమర్ కణాలను పూర్తిగా చంపేస్తుంది!

అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి కేన్సర్. ఇది ఒకసారి మనిషి శరీరంలో పుట్టిందంటే చాలు.. మళ్లీ మళ్లీ తిరగబెడుతూనే ఉంటుంది. కేన్సర్ కణాలు ఒళ్లంతా వ్యాపించి చివరికి మనిషిని పీల్చి చంపేస్తుంది. కేన్సర్ ప్రారంభంలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే జీవితకాలం పెంచుకోవచ్చు. కేన్సర్ చికిత్స తీసుకున్నప్పటికీ శరీరంలో తయారైన కేన్సర్ కణాలను పూర్తిగా నాశనం చేయడం కుదరదు. ఇందుకు కేమోథెరిపీ, ఇమ్యూనోథెరపీ వంటి ఎన్నో కేన్సర్ లేజర్ శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ సర్జరీలు ఎంత ఖరీదైనవో అంతే.. భరించలేనింత నొప్పిగా ఉంటాయి. చాలా తక్కువ మంది కేన్సర్ ను జయించినవారు ఉన్నారు. ఎలాంటి సర్జరీ చేయించుకున్నప్పటికీ పూర్తిగా కేన్సర్ కణాలను 100 శాతం నయం చేస్తాయంటే గ్యారెంటీ లేదు.
ఇకపై కేన్సర్ విషయంలో భయం అక్కర్లేదు. కేన్సర్ ను పూర్తిగా నయం చేసే కొత్త ట్రీట్ మెంట్ అందుబాటులోకి రానుంది. కేన్సర్ ను నయం చేసే కొత్త థెరపీని రీసెర్చర్లు సృష్టించారు. కేవలం లైటుతోనే కేన్సర్ కణాలను పూర్తిగా నాశనం చేయొచ్చు. చైనా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, హెరాయిట్-వాట్ యూనివర్శిటీల భాగస్వామ్యంలో వార్ విక్ యూనివర్శిటీ లో ఈ కొత్త థెరపీని కనిపెట్టారు.
కేన్సర్ కణాలను చంపేసే టెక్నిక్ ఫ్లాష్ లైటును రూపొందించారు. ఈ లైట్ నుంచి ఇరిడియం యాక్టివేట్ అవుతుంది. తద్వారా కేన్సర్ కణాలను గుర్తించి నాశనం చేస్తుంది. సాధారణంగా కేన్సర్ చికిత్సలన్నీ ఆక్సీజన్ మీద ఆధారపడి ఉంటాయి. కేన్సర్ కణాలన్నీ హైపోక్సిక్ కారణంగా తక్కువ రక్త ప్రసరణ జరిగి ఆక్సీజన్ తక్కువ మోతాదులో పరిమితంగా అందుతుంది. దీనిపై విస్తృతంగా పరిశోధనలు చేసిన సైంటిస్టులు.. ఇరిడియం కంపౌడ్ ను క్రియేట్ చేశారు. ఆక్సీజన్ స్థాయి తక్కువగా ఉన్నప్పటికీ కేన్సర్ కణాలను సులభంగా నాశనం చేయగలదని నిర్ధారించారు.
కేన్సర్ ప్రభావిత భాగాలపై ఒకసారి లైట్ ఫ్లాష్ వేస్తే చాలు.. వెంటనే ఇరిడియం యాక్టివేట్ అయి.. నికోటినామైడ్ అడినైన్ డిన్యుసెలోటైడ్ (NADH) విడుదల అవుతుంది. తద్వారా కేన్సర్ కణాలను పూర్తిగా నాశనం చేస్తుంది. క్యాటలిస్ట్ లా మారి ట్యూమర్ వ్యాపించిన కణాలను పూర్తిగా కట్ చేస్తుంది. కోఎంజైమ్ లు నాశనం చేయడం లేదా ఆక్సిడైజ్ ఫాంలోకి మార్చేస్తుంది. ఈ లైట్ ట్రీట్ మెంట్ ద్వారా శరీర భాగాల్లో పిత్తాశయం (బ్లాడర్), ఊపిరితిత్తులు, బ్రెయిన్స్, అన్నవాహిక, స్కిన్ పై వచ్చే కేన్సర్ ను ట్రీట్ చేసేందుకు అవసరమైన స్థాయిలో ఆఫర్ చేస్తుంటారు.
సాధారణంగా కేన్సర్ శస్త్రచికిత్స చేయించుకునే బాధితులకు ఎక్కువ శాతం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, ఇలాంటి సమస్యలను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ఈ లైట్ ట్రీట్ మెంట్ ఎంతో ప్రయోజకకరంగా ఉంటుందని యూనివర్శిటీ వార్ విక్ డిపార్ట్ మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీటర్ సాడ్లర్ తెలిపారు. ఈ కొత్త లైట్ కేన్సర్ ట్రీట్ మెంట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రాణాలను కాపాడవచ్చునని పీటర్ చెప్పారు.