New York Diwali : న్యూయార్క్ లో దీపావళి రోజున స్కూల్స్ కు సెలవు

నగరంలోని స్కూల్స్ కి దీపావళి పండుగ రోజున సెలవు ఇవ్వాల్సిందేనంటూ న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెనిఫర్ రాజ్ కుమార్ చాలాకాలంగా డిమాండ్ చేస్తోన్నారు.

New York Diwali : న్యూయార్క్ లో దీపావళి రోజున స్కూల్స్ కు సెలవు

New York Diwali

Updated On : June 27, 2023 / 1:07 PM IST

Diwali  Schools Holiday : దీపావళి.. భారతీయుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భారతీయులు దీపావళి పండుగను జరుపుకుంటారు. విదేశాల్లోని తెలుగువాళ్లు కూడా ఈ పండుగను ప్రతేడాది ఎంతో ఆనందంతో జరుపుకుంటారు. భారతీయులు ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు న్యూయార్క్ ప్రాధాన్యత కల్పించింది.

దీపావళి పండుగ రోజున న్యూయార్క్ లో స్కూల్స్ కు సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు మేయర్ ఎరిక్ ఆడమ్స్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. దీపావళి రోజున స్కూల్స్ కు సెలవు ప్రకటించడం చట్టంలో భాగమైనందుకు గర్విస్తున్నట్లు తెలిపారు.

ICC World Cup 2023 Schedule: వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. అక్టోబర్ 8న తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. ఉప్పల్ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు..

దీపావళి రోజున స్కూల్స్ కు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సాగిన పోరాటం అసెంబ్లీ మెంబర్ జెనిఫర్ రాజ్ కుమార్, సంఘం నాయకులకు అండగా నిలినందుకు గర్వపడుతున్నారు. ఈ ప్రకటనతో దీపావళి ముందుగానే వచ్చినట్లు అయిందని న్యూయార్క్ మేయర్ ఎరిక్ పేర్కొన్నారు.

నగరంలోని స్కూల్స్ కి దీపావళి పండుగ రోజున సెలవు ఇవ్వాల్సిందేనంటూ న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెనిఫర్ రాజ్ కుమార్ చాలాకాలంగా డిమాండ్ చేస్తోన్నారు. రెండు దశాబ్ధాల తన పోరాటం తర్వాత ఈ విషయంలో విజయం సాధించినందుకు సంతోకంగా ఉందని మేయర్ తెలిపారు.