Nobel Prize 2024 : అర్థశాస్త్రంలో ఆ ముగ్గురికి నోబెల్‌ పురస్కారం.. ఎవరెవరంటే?

Nobel Prize in Economics : 2024 ఏడాదికి గాను రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ నోబెల్ అవార్డులను ప్రకటించింది. అర్థశాస్త్రంలో అనేక అధ్యయనాలు చేసినందుకు ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాన్ని ఈ ముగ్గురు ఆర్థివేత్తలు అందుకోనున్నారు.

Nobel Prize 2024 : అర్థశాస్త్రంలో ఆ ముగ్గురికి నోబెల్‌ పురస్కారం.. ఎవరెవరంటే?

Nobel Prize in economics 2024 awarded to trio economists

Updated On : October 14, 2024 / 5:11 PM IST

Nobel Prize in Economics : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలను స్వీడన్‌లోని నోబెల్ బృందం విడుదల చేసింది. 2024 ఏడాదికి గాను రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ నోబెల్ అవార్డులను ప్రకటించింది. తాజాగా అర్థశాస్త్రంలో అనేక అధ్యయనాలు చేసినందుకు ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం అందించే ముగ్గురు ఆర్థివేత్తల పేర్లను ప్రకటించింది.

Read Also : Womens T20 World Cup 2024 : ఇదేమీ సిత్ర‌మో.. పాకిస్థాన్ గెల‌వాల‌ని కోరుకుంటున్న భార‌త అభిమానులు!

వారిలో డారన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్‌ ఉన్నారు. ఈ ముగ్గురు ఆర్థివేత్తలు ఆర్థిక శాస్త్రంలో “రాజకీయ సంస్థలు ఎలా ఏర్పడతాయి.. సమాజ శ్రేయస్సుపై ఎలా ప్రభావం చూపుతాయి” అనే అధ్యయనాలు చేసినందుకుగానూ సోమవారం (అక్టోబర్ 14) నోబెల్ బహుమతి లభించింది. త్వరలో ఈ ఆర్థికవేత్తలు నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు.

గతవారమే వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారికి నోబెల్ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా వైద్య విభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రకటన నేటితో ముగిసింది. ఇదివరకే వైద్యశాస్త్రంలో అనేక మందికి నోబెల్ పురస్కారాలను ప్రకటించగా.. ఆ తర్వాత వరుసగా రసాయనశాస్త్రం, సాహిత్యం, భౌతికశాస్త్రం వంటి విభాగాల్లో నోబెల్ పురస్కారాలను ప్రకటించారు.

అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపిక అయిన ఆర్థికవేత్తల్లో డారెన్‌, సిమోన్‌.. అమెరికాలో కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందినవారు. అలాగే, షికాగో యూనివర్సిటీలో రాబిన్‌సన్‌ అనేక అధ్యయనాలను పూర్తి చేశారు. డారన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్ ఈ నోబెల్ బహుమతిని షేర్ చేసుకోనున్నారు. అవార్డు గ్రహీతలు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ (1 మిలియన్ డాలర్ల) నగదు బహుమతిని అందుకుంటారు.

ఆర్థిక శాస్త్ర బహుమతిని ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఆర్థిక శాస్త్రాలలో ‘బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రైజ్’ అధికారికంగా పిలుస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, సాహిత్యంలో ఈ పురస్కారాలను అందజేస్తారు. 1968లో స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ దీన్ని స్థాపించారు. గత ఏడాదిలో హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్, లేబర్ మార్కెట్‌లో మహిళలపై చేసిన పరిశోధనలకుగాను ఈ బహుమతి అందుకున్నారు.

1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించారు. 1901లో ఆయన ట్రస్ట్ ద్వారా ఈ నోబెల్ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్నారు. వచ్చే డిసెంబర్‌ 10న నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గ్రహీతలకు ఈ నోబెల్ పురస్కారాలను అందజేస్తారు.

Read Also : మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ప్రతీకార దాడులు, సైనికులే లక్ష్యంగా అటాక్..