ఫిలిప్ఫీన్స్ లో భూకంపం…11మంది మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : April 23, 2019 / 02:37 AM IST
ఫిలిప్ఫీన్స్ లో భూకంపం…11మంది మృతి

Updated On : April 23, 2019 / 2:37 AM IST

ఉత్తర ఫిలిప్ఫీన్స్ లో భూకంపం సంభవించింది. 6.1తీవ్రతో సంభవించిన భూకంపం కారణంగా 11మంది మృతిచెందగా 100మందికిపైగా గాయపడ్డారు. బొడెగా పట్టణం కేంద్రంగా సంభవించిన భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలు చెందారు. పలు చోట్ల రైల్,రోడ్డు ట్రాన్స్ పోర్ట్,ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డామేజ్ అయింది.ఫిలిప్ఫీన్స్ రాజధాని  మనీలాలో భూప్రకంపనలు సంభవించాయి.దీంతో కొన్ని ఏరియాల్లో బిల్డింగ్ లు కూలిపోయాయి. ఒక్క పంపంగా ఫ్రావిన్స్ లోనే భూకంపం కారణంగా 8మంది చనిపోయినట్లు గవర్నర్ లిలియా పినిడా ప్రకటించారు.ఫిలిప్ఫీన్స్ లో 52 సార్లు భూమి కంపించిందని అంతర్జాతీయ వార్తాసంస్థ తెలిపింది.