నాకు కరోనా ఎలా వచ్చిందో..ప్రెసిడెంట్ గారి భార్య ఆశ్చర్యం

కరోనా వైరస్ తారతమ్యం లేదంటోంది. వాళ్లు ప్రముఖులా ? సామాన్యుడా అని చూడడం లేదు. ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం..అంతే సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో ప్రముఖులకు సైతం వైరస్ బారిన పడుతున్నారు. ప్రెసిడెంట్ లు, వారి కుటుంబసభ్యులకు, ఇతరులకు వైరస్ సోకుతోంది. కొంతమంది కోలుకుని బయటపడ్డారు. అయితే..వైరస్ సోకకుండా ఉండేందుకు పలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా కూడా వారు వైరస్ బారిన పడుతున్నారు. దీంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నాకు కరోనా వ్యాధి ఎలా వచ్చిందో అంటూ ఆశ్చర్యపోతున్నారు ప్రెసిడెంట్ గారి భార్య. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. మాస్కులు పెట్టుకున్నాం..గ్లౌజ్ లు వేసుకున్నాం..కానీ వైరస్ ఎలా వచ్చిందో తెలియడం లేదు అంటున్నారు. ఆమె ఎవరో కాదు…ఒలెనా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఒలోదిమిర్ జెలెన్ స్కీ సతీమణి. ఈ మేరకు ఆమె తన ఫేస్ బుక్ లో రాసుకొచ్చింది. దూరం పాటించామని, అయినా..తనకు కరోనా వైరస్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని వెల్లడించింది. కానీ ఆమె సంతోషం ఒక్కటే. భర్తకు, పిల్లలకు కరోనా టెస్టులు నిర్వహించగా…నెగటివ్ అని వచ్చింది.