Oxygen Production With Magnet : అయస్కాంతంతో ఆక్సిజన్‌ ఉత్పత్తి..అంతరిక్షంలో ప్రయాణించే వ్యోమగాముల కోసం

ఇంగ్లండ్‌ పరిశోధకులు వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేశారు. అయస్కాంతాల నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేశారు. అంతరిక్షంలో సుదీర్ఘ కాలం ప్రయాణాలు చేసే వ్యోమగాముల కోసం అయస్కాంతాల నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఎలక్ట్రోడ్‌ ఉపరితలాల నుంచి వాయు బుడగలను ఉత్పత్తి చేసి, ఆక్సిజన్‌ను సృష్టించవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ వార్‌విక్‌ పరిశోధకులు తెలిపారు.

Oxygen Production With Magnet : అయస్కాంతంతో ఆక్సిజన్‌ ఉత్పత్తి..అంతరిక్షంలో ప్రయాణించే వ్యోమగాముల కోసం

oxygen production with magnet (1)

Updated On : August 16, 2022 / 11:16 AM IST

Oxygen Production With Magnet : ఇంగ్లండ్‌ పరిశోధకులు వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేశారు. అయస్కాంతాల నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేశారు. అంతరిక్షంలో సుదీర్ఘ కాలం ప్రయాణాలు చేసే వ్యోమగాముల కోసం అయస్కాంతాల నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఎలక్ట్రోడ్‌ ఉపరితలాల నుంచి వాయు బుడగలను ఉత్పత్తి చేసి, ఆక్సిజన్‌ను సృష్టించవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ వార్‌విక్‌ పరిశోధకులు తెలిపారు.

తాము చేసిన ప్రయోగంలో ఆక్సిజన్ ఉత్పత్తి అయిందని వెల్లడించారు. ఎలక్ట్రోలైటిక్‌ సెల్స్‌ ద్వారా నీటిని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌గా విడగొట్టి ఇప్పటివరకూ వ్యోమగాములకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.

Liquid Oxygen Plant : గాంధీలో ఆక్సిజన్ ప్లాంట్లు.. నిమిషానికి వెయ్యి లీటర్ల ఉత్పత్తి

అయితే, ఈ విధానంలో వెలువడే హైడ్రోజన్‌ వంటి వాయువులతో వ్యోమనౌకలోని వ్యవస్థలకు అంతరాయం కలుగవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కానీ, తాము అభివృద్ధి చేసిన తాజా సాంకేతికతతో అలాంటి ఇబ్బందులు ఉండబోవని స్పష్టం చేశారు.