Liquid Oxygen Plant : గాంధీలో ఆక్సిజన్ ప్లాంట్లు.. నిమిషానికి వెయ్యి లీటర్ల ఉత్పత్తి

కరోనాతో ఊపిరాడక ఇబ్బందిపడుతున్న బాధితులకు ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చేసింది. శ్వాస అందక ఇబ్బందిపడుతున్న బాధితులకు నిరంతరాయంగా ప్రాణవాయువు ఇచ్చేందుకు గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్లు పూర్తయ్యాయి.

Liquid Oxygen Plant : గాంధీలో ఆక్సిజన్ ప్లాంట్లు.. నిమిషానికి వెయ్యి లీటర్ల ఉత్పత్తి

Liquid Oxygen Plant Setup From Gandhi Hospital

Liquid Oxygen Plant in Gandhi Hospital : కరోనాతో ఊపిరాడక ఇబ్బందిపడుతున్న బాధితులకు ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చేసింది. శ్వాస అందక ఇబ్బందిపడుతున్న బాధితులకు నిరంతరాయంగా ప్రాణవాయువు ఇచ్చేందుకు గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్లు పూర్తయ్యాయి. కరోనా బాధితులకు అదనపు ఆక్సిజన్‌ కోసం ఆస్పత్రి ప్రాంగణంలో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేశారు. ట్రయల్స్ కూడా విజయవంతం అయ్యాయి. ఆక్సిజన్ ఉత్పత్తి కూడా ప్రారంభమై అందుబాటులోకి వచ్చినట్టు ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. నిమిషానికి వెయ్యి లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ఈ ప్లాంటు ద్వారా ఉత్పత్తి అవుతుందని అంటున్నారు. ఆక్సిజన్‌ కొరత శాశ్వతంగా తొలగిపోనుందని చెబుతున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తగినంత ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు గాంధీ ఆస్పత్రి ఆవరణలో సుమారు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో యూనిట్‌ను నెలకొల్పారు. 4 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో 400 రోగులకు సరిపోయేలా నిమిషానికి వెయ్యి లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను అందించనున్నారు. రెండు ఆక్సిజన్ ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభమైంది. నీటి ఆవిరి, ఆక్సిజన్‌, నైట్రోజన్‌, పలు రకాల నోబల్‌ గ్యాస్‌లను తగిన మోతాదులో కలుపుతారు. ప్రత్యేకమైన యంత్ర పరికరాలను వినియోగించి వివిధ దఫాల్లో అవసరమైన ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు.

తద్వారా ద్రవ రూపంలో ఆక్సిజన్‌ తయారవుతుంది. అలా వచ్చిన లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులకు అనుసంధానం చేస్తారు. అలా ప్రత్యేక పైప్‌లైన్‌ ద్వారా ఐసీయూల్లోని వెంటిలేటర్లకు, ఆక్సిజన్‌ బెడ్‌లకు సరఫరా చేస్తారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలోని ఐసీయూలలో 500 వెంటిలేటర్‌ బెడ్లు, 1000 ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 20వేల లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ అవసరం అవుతున్నదని అధికారులు తెలిపారు. ఉమ్మడి కొండాపూర్‌ జిల్లా ఆస్పత్రిలో కూడా ఆక్సిజన్‌ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.