Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‭కు షాక్.. మళ్లీ జైలు తప్పేలా లేదు

బహుశా కోర్టు ఆర్డర్లను ముందే ఊహించిన ఇమ్రాన్ ఖాన్.. ప్రభుత్వం తనను జైలులో పెట్టినా వెనుకాడనని, తాను లొంగిపోనని, పాకిస్తాన్‭లో చట్టబద్ధమైన పాలన కోసం పోరాడుతూనే ఉంటానని శపథం చేశారు. గతంలోని కేసులపైనే బెయిల్ తెచ్చుకోగా, తాజాగా అది గడువు ముగుస్తోంది. బెయిల్ పొడగింపు కోసం నాలుగు రోజుల క్రితం ఇస్లామాబాద్ వెళ్లారు

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‭కు షాక్.. మళ్లీ జైలు తప్పేలా లేదు

Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‭కు ఎదురుదెబ్బ తగిలింది. లాహోర్‭లోని ఆంటీ టెర్రరిజం కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఇమ్రాన్ మరోసారి జైలు పాలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం అవినీతి కేసులో ఇమ్రాన్ అరెస్టైన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ నేతలు పాకిస్తాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ విషయమై ఇమ్రాన్ సహా పీటీఐ నాయకులపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులపై విచారించిన ఆంటీ టెర్రరిజం కోర్టు.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

Opposition Meet: విపక్షాల మీటింగుపై బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే.. బహుశా కోర్టు ఆర్డర్లను ముందే ఊహించిన ఇమ్రాన్ ఖాన్.. ప్రభుత్వం తనను జైలులో పెట్టినా వెనుకాడనని, తాను లొంగిపోనని, పాకిస్తాన్‭లో చట్టబద్ధమైన పాలన కోసం పోరాడుతూనే ఉంటానని శపథం చేశారు. గతంలోని కేసులపైనే బెయిల్ తెచ్చుకోగా, తాజాగా అది గడువు ముగుస్తోంది. బెయిల్ పొడగింపు కోసం నాలుగు రోజుల క్రితం ఇస్లామాబాద్ వెళ్లారు. దీనికి ముందు యూట్యూబ్ ద్వారా పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Bihar Politics: ప్రధాని మోదీని ఛాలెంజ్ చేసే ప్రతిపక్ష నాయకుడే లేడట.. అమిత్ షాను కలవగానే స్వరం మార్చిన మాంఝీ

“నన్ను జైలులో పెట్టినా నేను ప్రభుత్వానికి లొంగిపోను. చట్టబద్ధమైన పాలన, నా దేశ ప్రజలకు మంచి భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉంటాను” అని యూట్యూబ్ ద్వారా ఇచ్చిన ఖాన్ సందేశం ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్‌పై 140కి పైగా కేసులు ఉన్నాయి. అయితే ఇందులో ఉగ్రవాదం, హింస, దహన దాడులు, దైవదూషణ, హత్యాయత్నం, అవినీతి, మోసానికి ప్రజలను ప్రేరేపించడం వంటి 19 తీవ్రమైన కేసులు ఉన్నాయి. వీటి విషయంలోనే బెయిల్ కోసం సోమవారం లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వెళ్లారు.