Pakistan Election Result 2024 : పాకిస్థాన్‌లో రీ పోలింగ్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

రిగ్గింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో పాకిస్థాన్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15న రీ పోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.

Pakistan Election Result 2024 : పాకిస్థాన్‌లో రీ పోలింగ్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Pakistan Election 2024

Pakistan Election 2024: పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో గందరగోళం నెలకొంది. ఈనెల 8న జరిగిన ఓటింగ్ జరగ్గా.. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగితే 257 స్థానాలకు ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ మద్దతుతో స్వతంత్రులుగా బరిలోకి దిగిన వారిలో 102 మంది విజయం సాధించారు. నవీజ్ షరీఫ్ కు చెందిన పీఎంఎల్-ఎన్ పార్టీ అభ్యర్థులు 73 మంది, బిలావల్ భుట్టో పీపీపీకి చెందిన 54 మంది విజయం సాధించారు. ముత్తాహిదా క్వామీ మూవ్ మెంట్ 17 సీట్లు గెలుచుకోగా, పీఎంఎల్-క్యూ 3 సీట్లు, జేయూఐ-ఎఫ్, ఐపీపీ పార్టీ చెరోరెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఎండబ్ల్యూఎం పార్టీ, బీఎన్పీ పార్టీ ఒక్కో సీటును గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 133 సీట్లు కావాల్సి ఉంది. అయితే, ఏ పక్షానికి పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు.

Also Read : Pakistan Election Results 2024 : పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు హవా.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు నవాజ్ షరీఫ్ అడుగులు

దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఆ మేరకు కలిసి రావాలని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీరు పిలుపునిచ్చారు. దీంతో నవాజ్ షరీఫ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. నవాజ్ షరీఫ్ పార్టీ ముస్లిం లీగ్ – నవాజ్ (పీఎంఎల్-ఎన్)కు 73 సీట్లు రాగా, బిలావర్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అభ్యర్థులు 53 సీట్లలో విజయం సాధించారు. ఈ రెండు పార్టీలతో పాటు మరికొందరిని కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు దిశగా నవాజ్ షరీఫ్ అడుగులు వేస్తున్నారు. మరోవైపు తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఇమ్రాన్ ఖాన్ సూచించిన అభ్యర్థి ప్రధాని అవుతాడని పీటీఐ చెబుతుంది. మరోవైపు పీటీఐ ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఎన్నికల ఫలితాల్లో జాప్యం నేపథ్యంలో శాంతియుత నిరసనకు పీటీఐ పిలుపునిచ్చింది.

Also Read : Imran Khan Pakistan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్‌షాక్‌.. పీటీఐ పార్టీపై ఈసీ నిషేధం?

మరోవైపు, ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. యూఎస్, యూకే, యూరోపియన్ యూనియన్ పాక్ లో జరిగిన ఎన్నికల ప్రక్రియపై విమర్శలు గుప్పించాయి. అయితే, పాకిస్థాన్ వారి ఆరోపణలు తోసిపుచ్చింది. పలు నియోజకవర్గాల్లో సైన్యం మద్దతుతో పీఎంఎల్ -ఎన్ కు అధికారులు అనుకూలంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఇమ్రాన్ ఖాన్ పీటీఐకి అనుబంధంగా ఉన్న స్వతంత్ర అభ్యర్థులు లాహోర్ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. రిగ్గింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో పాకిస్థాన్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 52 పోలింగ్ స్టేషన్ లలో రీ పోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఫిబ్రవరి 15న పాకిస్థాన్ ఎన్నికల సంఘం సూచించిన పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది.