PM Shehbaz Sharif: గుణపాఠం నేర్చుకున్నాం.. భారత్ ప్రధాని మోదీతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం

భారత్‌తో మూడు యుద్ధాలు చేశాం. కానీ, ఆ యుద్ధాలవల్ల పేదరికం, నిరుద్యోగం పెరిగింది. మేం గుణపాఠం నేర్చుకున్నాం. ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నాం అని పాకిస్థాన్ ప్రధాని షాబాబ్ షరీఫ్ అన్నారు. భారత్‌తో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రధాని మోదీ చర్చించేందుకు సిద్ధమని అన్నారు.

PM Shehbaz Sharif: గుణపాఠం నేర్చుకున్నాం.. భారత్ ప్రధాని మోదీతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం

Pakistan Pm

Updated On : January 17, 2023 / 2:31 PM IST

PM Shehbaz Sharif: పొరుగుదేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. అక్కడి ప్రజలు తినడానికి గోదుమ పిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోయాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆర్థిక సాయంచేసేందుకు ముందుకొచ్చే దేశాలకోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆల్ అరేబియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని మోదీతో చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పాక్‌కు శాంతి కావాలని, కానీ కశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలను ఆపాలని షెహబాజ్ కోరారు.

Pakistan PM Shehbaz Sharif: ఇన్నాళ్లకు బోధపడిందా! ఉగ్రవాదమే పాకిస్థాన్‌కు ప్రధాన సమస్యగా మారిందన్న ప్రధాని షెహబాజ్

భారత్‌తో మూడు యుద్ధాలు చేశామని, కానీ ఆ యుద్ధాలవల్ల పేదరికం, నిరుద్యోగం పెరిగిందని, మేం గుణపాఠం నేర్చుకున్నామని, ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ వద్ద ఇంజనీర్లు, వైద్యులు, నైపుణ్యంఉన్న కార్మికులు ఉన్నారు. దేశ సౌభాగ్యంకోసం వాళ్లను వాడుకోవాలని, ఈ ప్రాంతంలో సుస్థిర శాంతికోసం ఆ చర్యలు తప్పవని, రెండు దేశాలు కూడా పురోగమిస్తాయని షరీఫ్ ఇంటర్వ్యూలో తెలిపారు.

 

భారత్‌తో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొనేందుకు భారత నాయకత్వానికి, ప్రధాని మోదీకి నేను విజ్ఞప్తి చేస్తున్నానని షాబాజ్ షరీఫ్ అన్నారు. మన వనరులను బాంబులు, గన్ పౌడర్‌ల తయారీలో ఖర్చుచేయడం పాకిస్థాన్‌కు ఇష్టం లేదని షాబాబ్ పేర్కొన్నాడు.