యుద్దానికి కాలు దువ్వుతోన్న పాక్: మిస్సైల్ టెస్ట్ ఫైర్ సక్సెస్

యుద్దానికి కాలు దువ్వుతోన్న పాక్: మిస్సైల్ టెస్ట్ ఫైర్ సక్సెస్

Updated On : August 29, 2019 / 7:53 AM IST

జమ్మూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వెనక్కు తగ్గడం లేదు. పాక్ మంత్రి చెప్పినట్లు యుద్ధానికి సర్వం సిద్ధం చేసుకుంటుంది పాక్. ఈ క్రమంలోనే గురువారం మిస్సైల్ గజ్నవిను టెస్ట్ ఫైర్ చేసింది. మేజర్ జనర్ ఆసిఫ్ ఘఫూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విజయాన్ని పాకిస్తాన్ ఆర్మీ బలగాలు ట్వీట్ చేశాయి. 30సెకన్ల వీడియోతో ప్రయోగం విజయవంతం అయిందని గ్రూప్ ఫొటోను విడుదల చేశారు.

ఈ మిస్సైల్ 290కి.మీ మేర ప్రాంతం వరకూ టార్గెట్‌లను నాశనం చేయొచ్చు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఈ ఘనత దక్కుతుందని ట్వీట్ లో పేర్కొంటూ పాక్ జాతి గర్వించాల్సిన సందర్భమని పేర్కొన్నాడు. నరేంద్ర మోడీ భారత్‌లో ఫిట్ ఇండియా మూమెంట్ అంటూ ప్రసంగిస్తున్న సమయంలో ఈ ట్వీట్ చేశారు. 

బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రయోగం చేశారట. కశ్మీర్ విషయం అంతర్జాతీయంగా మారినా ఐక్యరాజ్య సమితి కలుగజేసుకోవడం లేదని యుద్ధం తప్పనిసరి అంటూ పాక్ ప్రభుత్వం పలుమార్లు వెల్లడించింది. మరోవైపు చైనా.. పాక్‌కు సపోర్టివ్‌గా నిలిచింది. 

బుధవారం పాక్ రైల్వే మంత్రి మాట్లాడుతూ.. అక్టోబరు నెలాఖరు లేదా నవంబరు నెలలో భారత్-పాక్ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. పుల్వామా ఉగ్రదాడితో చెలరేగిన వివాదం ఆర్టికల్ 370రద్దుతో మరింత రాజుకుంది.