Video: నా సంసారం ముక్కలు కాకుండా కాపాడండి మోదీ.. భారత ప్రధానికి పాకిస్థాన్ యువతి వేడుకోలు
ఇద్దరూ ఇండియా పౌరులు కాదని, ఈ వ్యవహారం పాకిస్థాన్ పరిధిలోకి వస్తుందని, ఆమె భర్తను పాకిస్థాన్‌కు డిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు.
Pakistani Woman
Pakistani Woman: భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన నికితా నాగ్‌దేవ్ అనే మహిళ ఓ విజ్ఞప్తి చేసింది. తన భర్త తనను విడిచిపెట్టి, ఢిల్లీలో రహస్యంగా రెండో పెళ్లికి సిద్ధం అవుతున్నాడని చెప్పింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ వీడియో విడుదల చేసింది.
ఇండోర్‌లో దీర్ఘకాల వీసాతో తన భర్త విక్రమ్ నాగ్‌దేవ్ నివసిస్తున్నాడని నికిత చెప్పింది. పాకిస్థాన్ మూలాలున్న తన భర్త తనను పట్టించుకోవడం లేదని తెలిపింది. 2020 జనవరి 26న కరాచీలో హిందూ ఆచారాలతో తాము పెళ్లి చేసుకున్నామని చెప్పింది.
విక్రమ్ తనను 2020 ఫిబ్రవరి 26న ఇండియాకు తీసుకొచ్చాడని తెలిపింది. కానీ, కొన్ని రోజుల్లోనే తన జీవితం తారుమారైందని చెప్పింది. 2020 జూలై 9న వీసా సమస్య అంటూ అట్టారి సరిహద్దులో తనను వదిలేసి బలవంతంగా పాకిస్థాన్‌కు పంపించారని తెలిపింది. అప్పటినుంచి విక్రమ్ తనను తిరిగి తీసుకురావాలన్న ప్రయత్నం చేసిన దాఖలాలు ఏవీ లేవని చెప్పింది.
“నేను ఎప్పటికప్పుడు ఇండియాకు తీసుకెళ్లాలని అడుగుతూనే ఉన్నాను. కానీ ఆయన ప్రతిసారి నిరాకరిస్తూ వస్తున్నాడు” అని నికిత వీడియోలో చెప్పింది. “ఇప్పటికైనా న్యాయం జరగకపోతే మహిళలు న్యాయంపై నమ్మకం కోల్పోతారు. అనేక మంది అమ్మాయిలు తమ మెట్టినింట్లో శారీరకంగా, మానసికంగా హింసను ఎదుర్కొంటున్నారు. అందరూ నా పక్కన నిలవాలని కోరుతున్నాను” అని వేడుకుంది.
పెళ్లి తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలను కూడా నికిత వివరించింది. తన భర్త తమ బంధువుల్లో ఒకరితో సంబంధం పెట్టుకున్నాడని తెలిసిందని నికిత చెప్పింది. తన అత్తమామ దీని గురించి స్పందిస్తూ.. అబ్బాయిలంటే ఇలాగే చేస్తారని, ఇక ఎవరూ ఏమీ చేసేది లేదని వారు అన్నారని తెలిపింది.
కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో విక్రమ్ తనను పాకిస్థాన్‌కి వెళ్లాలని బలవంతపెట్టాడని, ఇప్పుడు ఇండియాకి రానివ్వడం లేదని నికిత ఆరోపించింది. “ప్రతి మహిళకీ ఇండియాలో న్యాయం రావాలి” అని చెప్పింది.
విక్రమ్ ఢిల్లీకి చెందిన మహిళతో రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడని తెలిసిందని నికిత తెలిపింది. 2025 జనవరి 27న దీనిపై ఫిర్యాదు చేశానని చెప్పింది. ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టులో ఉండగా, అది సింధీ పంచ్ మెడియేషన్ అండ్ లీగల్ కౌన్సెల్ సెంటర్‌కు చేరింది.
విక్రమ్‌కు, అతడు వివాహం చేసుకోబోతున్న యువతికి నోటీసులు పంపి విచారణ జరిపారు. కానీ మధ్యవర్తిత్వం విఫలమైంది. 2025 ఏప్రిల్ 30న వచ్చిన నివేదికలో… ఇద్దరూ ఇండియా పౌరులు కాదని, ఈ వ్యవహారం పాకిస్థాన్ పరిధిలోకి వస్తుందని, విక్రమ్‌ను పాకిస్థాన్‌కు డిపోర్ట్ చేయాలని సూచించారు.
अटारी बॉर्डर पर छोड़ गया पति, निकिता बोली-‘मेरा जीवन बर्बाद हुआ, PM मोदी मदद करें’#NikitaNagdev #JusticeForNikita #PMModi #ViralVideo #IndoreCase #PakistanIndia #DeportVikram #SocialMediaViral #AppealForJustice #BreakingNews pic.twitter.com/UaQET8rOBx
— Bansal News Digital (@BansalNews_) December 6, 2025
