Elon Musk: ఇండియన్ టాలెంట్‌తో అమెరికా బాగుపడుతోంది – ఎలన్ మస్క్

భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ కొత్త సీఈఓగా ఎంపికయ్యారు. 16ఏళ్ల పాటు ఆ పదవిలో ఉన్న ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డార్సీ పదవి నుంచి దిగిపోవడంతో..

Elon Musk: ఇండియన్ టాలెంట్‌తో అమెరికా బాగుపడుతోంది – ఎలన్ మస్క్

Parag Agarwal

Updated On : November 30, 2021 / 12:33 PM IST

Elon Musk: భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ కొత్త సీఈఓగా ఎంపికయ్యారు. 16ఏళ్ల పాటు ఆ పదవిలో ఉన్న ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డార్సీ పదవి నుంచి దిగిపోవడంతో.. భారత సంతతికి చెందిన సీఈఓల్లో ఒకరయ్యారు. ఐబీఎమ్- అరవింద్ కృష్ణ, గూగుల్ – సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ – సత్య నాదెళ్లలతో చేరిపోయాడు.

దీనిపై టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశారు. ఇండియన్ టాలెంట్ తో అమెరికా మంచి బెనిఫిట్స్ దక్కించుకుంటుందని అన్నారు. కొత్త సీఈఓ కాకముందు వరకూ అగర్వాల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా ఉన్నారు. 2011 నుంచి ట్విట్టర్ తో కలిసి పనిచేసినప్పటికీ పబ్లిక్ గ్లేర్ కు దూరంగా ఉన్నాడు.

అగర్వాల్ ను సీఈఓగా అపాయింట్ చేశారని తెలియగానే.. ఎలన్ మస్క్ ఇలా ట్వీట్ చేశారు. ‘యూఎస్ఏ ఇండియన్ టాలెంట్ తో బాగా బెనిఫిట్ పొందుతుంది’ అంటూ పోస్టు పెట్టాడు.

……………………………………: ఒక్క హిట్టు.. ఇప్పుడు ఆశలన్నీ ఒక్క హిట్టుపైనే

ఐఐటీ ముంబైలో చదివిన 37ఏళ్ల అగర్వాల్.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. ట్విట్టర్ లో జాయిన్ అవకముందు మైక్రోసాఫ్ట్, ఏటీ అండ్ టీ, యాహూలో పనిచేశారు.