viral pic : ఈ జింక కొమ్ములేంటీ ఇలాగున్నాయ్!

viral pic : ఈ జింక కొమ్ములేంటీ ఇలాగున్నాయ్!

Antelope Horns Pics Viral

Updated On : March 31, 2021 / 1:42 PM IST

antelope Horns pics viral : సాధారణంగా జింక కొమ్ములు చెట్టు కొమ్మల్లా ఉంటాయి. మరికొన్ని జింకల కొమ్ములు ఏటవాలుగా మొనదేలి ఉంటాయి. కానీ ఇదిగో ఇక్కడ చూడండీ..ఈ ఫొటోలో కనిపిస్తున్న జింక కొమ్ములేంటి ఇలా ఉన్నాయి?!. ఇటువంటి జింకలను ఎప్పుడూ చూడలేదే? కొత్తగా ఉందే దీని కొమ్ముల యవ్వారం? అనిపిస్తోంది కదూ..

మీరే కాదు.. ఈ ఫొటోలను మొదటిసారి సోషల్ మీడియాలో చూసినపుడు అందరూ ఇలాగే ఆశ్చర్యపోయారు. ఇదేదో కొత్త జంతువని కొందరు అంటే..జింక కొమ్ముల మధ్య ప్లాస్టిక్ ఇరుక్కుపోయిందని మరికొందరు అనుకున్నాడు. కానీ అసలు విషయం ఏమిటంటే..ఆ జింక రెండు కొమ్ముల మధ్య ఓ సాలె పురుగు ఏకంగా గూడులాగా అల్లేసింది. సాలెపురుగు అల్లేసి గూడుతో రెండు కొమ్ముల మధ్యా ఏదో కట్టేసినట్లుగా ఉన్నాయి ఈ జింక కొమ్ములు.

ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న బొత్సవానాలోని సెంట్రల్ కలహరి గేమ్ రిజర్వ్‌లో ఉన్న జింక కొమ్ములను చూసాక అక్కడి నిర్వాహకులే ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అది సాలె గూడు అని తెలుసుకుని అనుకున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీని కొమ్ముల్ని అనుసంధాన్నిస్తూ గూడు అల్లేసిన ఈ సాలెపురుగు ఈ జింకను వైరల్ చేసేసింది కదూ..