కూలిన విమానం : 12మంది దుర్మరణం

కొలంబియాలో విషాదం చోటు చేసుకుంది. విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 12మంది ప్రయాణికులు చనిపోయారు. మృతుల్లో తరారీయా, డోరిస్ గ్రామాల మేయర్, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. 30 సీట్ల కెపాసిటీ గల డగ్లస్ DC-3 విమానం బ్రెజిల్ సరిహద్దు సమీపంలోని టరైరాకు వెళ్తోంది. 120 కిలోమీటర్ల ఈ మార్గంలో 85 కిలోమీటర్లు ప్రయాణించిన విమానం శాన్‌జోస్ డెల్ గౌవైరే, విల్లావిసెన్సియా పట్టణాల మధ్య అకస్మాత్తుగా కూలిపోయిందని అధికారులు చెప్పారు.
విమానం కూలిన వెంటనే మంటల్లో చిక్కుకోవడంతో అందరూ ప్రాణాలు కోల్పోయారని కొలంబియా అధికారులు తెలిపారు. విమానం కూలడానికి కారణం ఇంకా తెలియనప్పటికీ, ఇంజిన్ వైఫల్యమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. విమానం ప్రయాణించిన సమయంలో ప్రతికూల వాతావరణం ఏమీ లేదని అధికారులు వివరించారు. విమాన ప్రమాదంలో ఎవరూ బతికి బయటపడలేదని తెలిపారు. Douglas DC-3 aircraft అమెరికన్ మేడ్ విమానం. ఇందులో ట్విన్ ఇంజిన్ ప్రొపెల్లర్ ఉంది. 1930లో దీన్ని తయారు చేశారు. కార్గొ, ప్యాసింజర్ సర్వీసులు అందించే ట్రాన్స్‌పోర్టు కంపెనీ లేజర్.. ఈ ప్లేన్‌ను నడుపుతోంది.