Pluto గుండె కొట్టుకుంటోంది : మరగుజ్జు గ్రహంపై మంచు గాలులు!

సౌర మండలంలో ఇతర గ్రహాలకు చివరిగా ఉన్న అతి చిన్న మరగుజ్జు గ్రహం ఫ్లూటో. గుండె ఆకారంలో ఉండే ఈ గ్రహంపై కొన్ని అద్భుతమైన రహాస్యాలను NASA న్యూ హారిజన్స్ అంతరిక్ష నౌక కనిపెట్టింది. జూలై 2015 అంతరిక్షయానంలో మరగుజ్జు గ్రహం ఫూట్లోను కనుగొంది. గుండె ఆకారంలో ఉండే ఈ ప్లూటోపై వాతావరణ వాయువు ప్రసరణ నమూనాలు ఉన్నట్టు ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది.
నత్రజని గాలులు : పగలు ఆవిరిలా.. రాత్రికి మంచులా :
అంతేకాదు.. ఈ ఫ్లూటో హార్ట్.. నత్రజని వాయువును పంపింగ్ చేస్తోందని తెలిపింది. గ్రహంలోని గుండె ఎడమ లంబికలో 600 మైళ్ల వెడల్పు (1,000 కిలోమీటర్లు) నత్రజని-మంచు వాయువును స్పుత్నిక్ ప్లానిటియా అని పిలుస్తారు. ఈ అన్యదేశ మంచు పగటిపూట ఆవిరైపోతుంది. అదే రాత్రి సమయంలో మళ్లీ మంచులా గడ్డుకడుతుంది. దీని కారణంగా ఆ గ్రహంపై నత్రజని గాలులు వీస్తుంటాయని పరిశోధకులు నిర్ణయించారు.(ప్లూటో గ్రహంపై వాతావరణం భూమి మాదిరిగా నత్రజనితో ఆధిపత్యం చెలాయిస్తుంది.
మనం పీల్చే గాలి కంటే.. లక్ష రెట్లు ఎక్కువ :
అయినప్పటికీ మరగుజ్జు గ్రహంపై వీచే గాలి.. మనం పీల్చే గాలి కంటే లక్ష రెట్లు సన్నగా ఉంటుంది) అని నిర్ధారించారు. ఈ గాలులు వేడి, పొగమంచు కణాలు, మంచు బిందువులను పడమర వైపుకు తీసుకెళ్తాయి. అక్కడ మంచు గీతలు చీకటి గీతలతో ఉంటాయి. ప్లూటో వాతావరణంలో వీచే గాలులు అక్కడి గాలి సాంద్రత చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఉపరితలంపై ప్రభావం చూపుతుందని కాలిఫోర్నియాలోని నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్‌లోని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ప్రధాన రచయిత టాంగూ బెర్ట్రాండ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
పశ్చిమ దిశకు గాలులు :
ప్లూటో దాని అక్షం మీద తూర్పువైపు తిరుగుతుందని అనిపించేలా ఉంటూనే ఆ పడమటి దిశ ఆసక్తికరంగా కనిపిస్తోంది. మరగుజ్జు గ్రహం వాతావరణం ‘రెట్రోరోటేషన్’ ను ప్రదర్శిస్తుందని అధ్యయన బృందం సభ్యులు గుర్తించారు. బెర్ట్రాండ్ అతని సహచరులు ప్రోబ్ 2015 సమాచారం అధారంగా న్యూ హారిజన్స్ సేకరించిన డేటాను అధ్యయనం చేశారు. ఇది పశ్చిమ గాలుల ఉనికిని వెల్లడించింది.
ఫ్లూటో ఉపరితలం నుంచి కనీసం 2.5 మైళ్ళు (4 కిలోమీటర్లు) స్పుత్నిక్ ప్లానిటియా పశ్చిమ అంచుని అనుసరించే భూమికి దగ్గరగా వేగంగా కదిలేలా ఉందని కొత్త అధ్యయనం చెబుతోంది. ఆ అంచు ఎత్తైన కొండలతో సరిహద్దులుగా ఉంది. ఇవి స్పుత్నిక్ ప్లానిటియా బేసిన్ లోపల ఉన్న ఉపరితల గాలులను పడమర వైపుకు వీచేలా ప్రభావితం చేస్తున్నాయని కొత్త అధ్యయనం సూచించింది.