Modi-Kamala Harris : యూఎస్ వైస్ ప్రెసిడెంట్‌కి మోదీ అపూర్వ కానుక

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ..అమెరికా ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హ్యారిస్‌ కి ప్రత్యేకమైన కానుకలు ఇచ్చారు. అమెరికా పర్యనటలో ఉన్న మోదీ..శుక్రవారం వైట్ హౌస్ లో

Modi-Kamala Harris : యూఎస్ వైస్ ప్రెసిడెంట్‌కి మోదీ అపూర్వ కానుక

Modi Kamala

Updated On : September 24, 2021 / 6:02 PM IST

MODI-KAMALA భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ..అమెరికా ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హ్యారిస్‌ కి ప్రత్యేకమైన కానుకలు ఇచ్చారు. అమెరికా పర్యనటలో ఉన్న మోదీ..శుక్రవారం వైట్ హౌస్ లో కమలా హ్యారిస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వంలో పనిచేసిన కమల తాత పీవీ గోపాలన్​కు సంబంధించిన పాత నోటిఫికేషన్​ల ప్రతిని హస్తకళతో చేసిన చెక్క ఫ్రేమ్​లో కమలా హ్యారిస్ కు బహూకరించారు మోదీ. ఇండియాలో ప్రభుత్వాధికారిగా గోపాలన్​ వివిధ హోదాల్లో పనిచేసిన విషయం తెలిసిందే.

వుడెన్ ఫ్రేమ్‌తోపాటు గులాబీ మీనాక‌రీ చెస్ సెట్‌ను కూడా క‌మ‌లా హ్యారిస్‌కు మోదీ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ చెస్ సెట్ ప్ర‌పంచంలోని పురాత‌న న‌గ‌రాల్లో ఒక‌టైన‌ కాశీలో త‌యారు కావ‌డం విశేషం. ఈ చెస్ సెట్​ కూడా హస్తకళాకారులు చేసిందే.

Gift2

మరోవైపు, క్వాడ్​ కూటమి దేశాధినేతలకు ప్రత్యేకమైన కానుకలు ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆస్ట్రేలియా ప్ర‌ధాని మోరిస‌న్‌కు సిల్వ‌ర్ గులాబీ మీనాక‌రీ ప‌డ‌వ‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. హస్తకళతో చేసిన ఈ పడవ కూడా కాశీ విశిష్టతను తెలియజేసేలా ఉంటుంది. ఇక జ‌పాన్ ప్ర‌ధాని యోషిండె సుగ‌కు గంధపు చెక్క‌తో చేసిన బుద్ధుని విగ్ర‌హాన్ని కానుకగా ఇచ్చారు మోదీ.

Gift

ఇక,అమెరికా పర్యటనలో మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ ప్రధాని మోదీ..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ కానున్నారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు బైడెన్​తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం వైట్ హౌస్ లో జరగనుంది. వీరి భేటీ గంటసేపు కొనసాగనుంది.

READ PM Modi: కమలాహారిస్‌ను ఇండియాకు ఆహ్వానించిన ప్రధాని మోదీ