PM Modi: కమలాహారిస్‌ను ఇండియాకు ఆహ్వానించిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ శుక్రవారం అమెరికా వెస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇండియా - అమెరికా నేచురల్ పార్టనర్స్ అని కొనియాడారు మోదీ.

PM Modi: కమలాహారిస్‌ను ఇండియాకు ఆహ్వానించిన ప్రధాని మోదీ

Pm Modi (3)

PM Modi: ప్రధాని మోదీ శుక్రవారం అమెరికా వెస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇండియా – అమెరికా నేచురల్ పార్టనర్స్ అని కొనియాడారు మోదీ. మ్యూచువల్, గ్లోబల్ ఇంటరస్ట్ అంశాలపై జరిగిన చర్చల్లో ఇద్దరు లీడర్లు పాల్గొన్నారు.

‘ఇండియా, అమెరికాలు నేచురల్ పార్టనర్స్. మాకు సామీప్య విలువలు, భౌగోళిక రాజకీయ ఆసక్తులు ఉన్నాయి’ అని పీఎం మోదీ.. హారిస్ తో పాటు పాల్గొన్న సమావేశంలో వెల్లడించారు. ఇండియా, అమెరికాలు అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగి ఉన్నాయి. ఇరు దేశాల విలువలు, సహకారం క్రమంగా పెరుగుతూనే ఉంది.

ఇండియాలో కొవిడ్ సంక్షోభం గురించి జూన్ నెలలో పీఎం మోదీతో మాట్లాడిన కమలాహారిస్.. నేరుగా మోదీని కలవడం ఇదే తొలిసారి.

……………………………: పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వ నిధి కాదు..ఢిల్లీ హైకోర్టుకి తెలిపిన కేంద్రం

‘మన ద్వైపాక్షిక సంబంధాలు ప్రెసిడెంట్ జో బైడెన్ సమక్షంలో మరో స్థాయికి చేరతాయని వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ అన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో చాలా మందికి ఇది ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుందని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా కమలాహారిస్ ను ఇండియాకు ఆహ్వానించారు మోదీ.

4 రోజుల పర్యటన నేపథ్యంలో అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రధాని మోదీ. క్వాల్‌కామ్‌, అడోబ్‌, ఫస్ట్‌ సోలార్‌, జనరల్‌ అటమిక్స్‌, బ్లాక్‌స్టోన్‌ కంపెనీలకు సంబంధించిన ఐదుగురు సీఈవోలతో చర్చలు నిర్వహించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ ప్రధాని యోషిహిదే సుగాతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో భవిష్యత్‌ కార్యచరణపై చర్చించారు.