PM CARES : పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వ నిధి కాదు..ఢిల్లీ హైకోర్టుకి తెలిపిన కేంద్రం

విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రైమ్ మినిస్టర్స్ సిజిటన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్ ఫండ్ (పీఎం కేర్స్ ఫండ్)అనేది చట్టం ప్రకారం

PM CARES : పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వ నిధి కాదు..ఢిల్లీ హైకోర్టుకి తెలిపిన కేంద్రం

Pm Cares

PM CARES విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రైమ్ మినిస్టర్స్ సిజిటన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్ ఫండ్ (పీఎం కేర్స్ ఫండ్)అనేది చట్టం ప్రకారం ఓ ఛారిటబుల్ ట్రస్ట్ అని, పీఎం కేర్స్ ఫండ్ భారత ప్రభుత్వ నిధి కాదని ఢిల్లీ ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. అయితే పీఎం కేర్స్ కార్యకలాపాలు మాత్రం పారదర్శకంగా జరుగుతాయని పేర్కొంది. పీఎం కేర్స్​ ఫండ్‌ని రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వ నిధిగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై విచారణ నేపథ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) సెక్రటరీ ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ ఈ అఫిడవిట్‌ను ఫైల్ చేశారు. పీఎం కేర్స్​ ట్రస్ట్​లో పీఎంఓ సెక్రటరీ ప్రదీప్​ కుమార్​ శ్రీవాస్తవా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.

READ TMC In Goa : గోవాపై టీఎంసీ కన్ను..రంగంలోకి పీకే..రా రమ్మంటున్న సీఎం సావంత్

దాతల నుంచి ఆన్‌లైన్ పేమెంట్స్, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్స్ ద్వారా డొనేషన్స్‌ తీసుకున్నాం. వీటిని ఆడిటింగ్ కూడా చేయిస్తాం. ఆడిట్ రిపోర్టులతోపాటు ఫండ్‌లో ఉన్న నిధులు, జమాఖర్చులు తదితర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాం. ప్రజల ఆసక్తుల దృష్ట్యా మరే ఛారిటీ సంస్థతోనూ పోల్చలేని విధంగా నిజాయితీ, పారదర్శకతలే ప్రాతిపదికలుగా ఈ నిధిని వినియోగిస్తున్నాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్​ 12 ప్రకారం పీఎం కేర్స్​ ప్రభుత్వ నిధిగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఈ ఫండ్‌కు సంబంధించిన అన్ని తీర్మానాలను వెబ్‌సైట్‌లో పెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

అయితే, పీఎం కేర్స్​ ఫండ్ ప్రభుత్వ ప్రత్యేక నిధి అని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్చి 27,2020న దీనిని ఏర్పాటు చేసినట్లు పిటిషనర్​ సమ్యాక్​ గంగ్వాల్ పేర్కొన్నారు. ఈ నిధి రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వ నిధి కిందకు రాకుంటే ప్రభుత్వ డొమైన్​గా ఉన్న పేరును మార్చటం సహా ప్రధాని ఫొటో, లోగో వంటి వాటిని తొలగించాలని పిటిషనర్​ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ట్రస్టీలుగా ప్రధాని, రక్షణ, హోం, ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారని, ఈ ట్రస్టును ఏర్పాటు చేసినప్పుడే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. పారదర్శకత, జవాబుదారితనాన్ని కాపాడేందుకు పీఎంకేర్స్​ వెబ్​సైట్​పై ఆడిట్​ నిర్వహించటం, విరాళాల వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను సెప్టెంబర్​ 27కు వాయిదా వేసింది. ​

కాగా,విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌‌పై ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్న విషయం తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్ విజ‌ృంభిస్తున్న సమయంలో సెలబ్రిటీలతోపాటు అనేక మంది ఈ ఫండ్‌కు విరాళాలను అందించారు. అయితే ఈ డొనేషన్స్‌ను ప్రజలకు అందించారా అంటూ విపక్షాలు ప్రశ్నించాయి. ఈ ఫండ్ పనితీరు, నిర్వహణపై పలు ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.