ఇండియాలో కరోనా టెస్టుల్లో కొత్త టెక్నిక్.. అందరి బ్లడ్ శాంపుల్స్ ఒకేసారి

పూల్ టెస్టింగ్ పద్ధతికి ఇండియా రెడీ అయింది. ల్యాబరేటరీల్లో గంటల కొద్దీ సమయం వెచ్చించడం, శారీరక శ్రమ తగ్గించే ఉద్దేశ్యంతో ఈ పద్ధతి ఫాలో అవ్వాలనుకుంటున్నారు. ఈ టెస్టు ప్రకారం.. శాంపుల్స్ అన్ని కలిపి ఒకేసారి RTPCR టెస్టు చేస్తారు. ఆ టెస్టు ఫలితం నెగెటివ్ వస్తే ఓకే. ఒకవేళ పాజిటివ్ విడిగా ఒకొక్కరి శాంపుల్స్ మళ్లీ టెస్టులకు పంపిస్తారు.
ఈ పూల్ టెస్టింగ్ కు వెళ్లడానికి ఒకటే ఉద్దేశ్యం కరోనా టెస్టుల్లో చాలా మందికి పరీక్ష చేసిన తర్వాత నెగెటివ్ వస్తుండటంతో ఈ టెక్నిక్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. తద్వారా సమయం ఆదా చేయడమే కాకుండా కరోనా రోగులను కాపాడేందుకు టైం దొరుకుతుంది. (నయా బాస్ : ఏపీ ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ వి.కనగరాజ్)
ఇటీవల ఇజ్రాయేల్‌లో చేసిన టెస్టుల్లో 64 మంది బ్లడ్ శాంపుల్స్ తో పరీక్షలు నిర్వహించారు. టెస్టింగ్ టెక్నిక్ లు మార్చి వ్యాప్తిని అడ్డుకోవడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు అంటున్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పూల్ టెస్టింగులు నిర్వహించి నెగెటివ్ వచ్చిన వారందరినీ గుర్తించారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గురువారం ఈ టెక్నిక్ పై నిర్ణయాన్ని వెల్లడించింది. హాట్ స్పాట్లు, క్లస్టర్లు, జనం గుంపులుగా ఉండే ప్రాంతాల్లో ఈ టెస్టులు నిర్వహిస్తున్నారు. జ్వరం, దగ్గు, పొడి దగ్గు, జలుబు ఉన్న వారికి టెస్టుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ లక్షణాలు ఏడు రోజులుగా ఉన్నవారిని టెస్టులకు పిలుస్తారు.