Pope Letter to Couple : దంపతులూ..ఈ మూడు మాటలు ఎప్పుడూ గుర్తుంచుకోండి : పోప్ ప్రాన్సిస్ సూచనలు
పోప్ ప్రాన్సిన్స్ దంపతులకు లేఖ రాశారు. దంపతులు వారి జీవితంలో మూడు మాటలు ఎప్పుడు గుర్తుంచుకోవాలని..ఈ మూడుమాటలు వారిజీవితాల్లో సుఖ సంతోషాలను నింపుతాయని మూడు మాటలు సూచించారు.

Pope 3 Suggestions Letter To Couple
Pope 3 Suggestions letter to couple : వివాహం. మూడు ముళ్లతో ఒక్కటైనా..ఉంగరాలు మార్చుకుని ఏకమైనా..లేదా సంతకాలు పెట్టుకుని దంపతులు అయినా..ఇరువురు జీవితాంతం కలిసి ఉండాలి..బేధాభిప్రాయాలు వచ్చినా సర్ధుకుపోవాలి. ముఖ్యంగా పిల్లలు ఉన్న దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవటం..నమ్మకం ఏర్పరచుకోవటం చాలా ముఖ్యం. వివాహం బంధంలో మనస్పర్ధలు సర్వసాధారణమే..కానీ ఆ బంధాన్ని నిలుపుకోవాలంటే దంపతులు వారి జీవితాల్లో మూడు మాటలు ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలని ఆ మూడు మాటల్ని ఉపయోగించాలని పోప్ ప్రాన్సిన్స్ దంపతులకు సూచించారు.
Read more : Gods Warm In Winter అయోధ్యలో దేవుళ్లకు చలి వేయకుండా స్వెట్టర్లు, దుప్పట్లు..వేడి కోసం యంత్రాలు
దంపతులు వారి వివాహ బంధాన్ని నిలుపుకోవటానికి ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడు ‘‘దయచేసి, ధన్యవాదాలు, క్షమించండి’’.. అనే మూడు కీలక పదాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని కోరారు. కరోనా కాలంలో వివాహ బంధాలు విచ్ఛిన్నం కావడంపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు విడిపోతే.. అది వారి పిల్లలపపై వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని..అందుకే పెళ్లైన దంపతులు.. దయచేసి, ధన్యవాదాలు, క్షమించండి.. అనే మూడు కీలక పదాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని కోరారు.
ఆదివారం ప్రార్ధనా సమయంలో పోప్ ప్రాన్సిస్ వివాహిత జంటలకు లేఖ రాశారు. ‘‘లాక్‌డౌన్లు, క్వారంటైన్ల కారణంగా కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం ఒకరితో ఒకరు గడపాల్సి వస్తోంది. ఇది కొందరి కుటుంబాల్లో సమస్యలను తెచ్చిపెడుతోందని..చాలా మంది దంపతులు ఒత్తిడి వల్ల సహనం కోల్పోతున్నారని . అపార్థాలతో వాదనలకు దిగుతున్నారని..ఇవన్నీ వారు విడిపోవటానికి కారణాలుగా మారుతున్నాయని అన్నారు.
Read more : Taliban Cancel EC : ఎన్నికల కమిషన్‌ను రద్దు చేసిన తాలిబన్ల ప్రభుత్వం
ఇది తల్లిదండ్రుల నుంచి ప్రేమ, విశ్వాసం, కోరుకొనే పిల్లలపై ప్రభావం చూపిస్తోందని.. వాదన జరిగిన ప్రతిసారి రాజీ కుదుర్చుకోవడానికి భార్యాభర్తలు అహానికి పోకుండా సామరస్యంతో తిరిగి కలుసుకోవాలని..అది భర్త అయినా సరే..భార్య అయినా సరే..అని గొడవలు పడిన ప్రతీసారి..ఎవరో ఒకరు తగ్గి తిరిగి కలుసుకోవటానికి అర్థం చేసుకోవటానికి యత్నించాలని ఇలా చేయటం వల్ల వారి కుటుంబంతో పాటు పిల్లల భవిష్యత్తు కూడా చాలా మంచిదని పోప్ ఫ్రాన్సిస్ సూచించారు.