హాస్పిటల్ నుంచి Trump డిశ్చార్జి అప్పుడే..

హాస్పిటల్ నుంచి Trump డిశ్చార్జి అప్పుడే..

Updated On : October 5, 2020 / 12:11 PM IST

President Donald Trump.. ఆరోగ్య పరిస్థితి ఇంప్రూవ్ అయిందని Walter Reed Medical Center వెల్లడించింది. దాదాపు రేపటికల్లా హాస్పిటల్ నుంచి పంపించేస్తామని వైట్ హౌజ్ ఫిజిషియన్ సీన్ కాన్లీ చెపపారు. కరోనావైరస్ తో పోరాడుతూ.. ఆక్సిజన్ అందక శుక్రవారం, శనివారం ట్రంప్ ఇబ్బందిపడ్డారు.

అతని డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం.. శుక్రవారం ఉదయం నుంచి అతనికి ఎటువంటి జ్వరం రాలేదు. ఆదివారం జరిగిన ప్రెస్ కాన్ఫిరెన్స్ లో కాన్లీ.. ట్రంప్ యాంటీవైరల్ డ్రగ్ రెమెడెసివర్, డెక్సామెథాసోన్ వంటివి వాడుతూ కార్టికోస్టెరాయిడ్ డ్రగ్ వాడుతున్నట్లు చెప్పారు.



వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. ఇవన్నీ కొవిడ్-19తీవ్ర అనారోగ్య సమస్య ఉన్నప్పుడు మాత్రమే వాడతారు. ‘డెక్సామెథాసోన్ అనేది శరీరానికి ఆక్సిజన్ అందించడంలో సప్లిమెంట్ గా పనిచేస్తుంది’ ని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యురిటీ సీనియర్ స్కాలర్ అమేశ్ అదాల్జా చెప్పారు.

ఆదివారం ట్రంప్ ట్వీట్ చేస్తూ.. ఆయనకు బాగానే ఉందని.. శుక్రవారం నుంచి హాస్పిటల్ లోనే ఉంటున్నట్లు పోస్టు చేశారు.