నమో నినాదాలతో మార్మోగిన హ్యూస్టన్…వేదికపైకి మోడీ

నమో మోడీ నినాదాలతో మార్మోగిన హ్యూస్టన్ మార్మోగిపోయింది. అమెరికాలోని హ్యూస్టన్ లోని ఎన్ఆర్ జీ స్టేడియంలో జరుగుతున్న హౌడీ మోడీ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. మోడీ వేదికపైకి రాగానే నమో నినాదాలతో సభ మార్మోగిపోయింది. భారత్ మాతా కీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 50వేల మంది ఎన్నారైలు ఈ కార్యక్రమానికి హాజరయ్యాను.
అమెరికాలోని రాజకీయ పార్టీల నాయకులు,ఎంపీలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రామానికి హాజరయ్యారు. భారత్ మాతా కీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఈవెంట్ కు హాజరవుతున్నారు.