Pakistan PM Shehbaz Sharif: ఇన్నాళ్లకు బోధపడిందా! ఉగ్రవాదమే పాకిస్థాన్‌కు ప్రధాన సమస్యగా మారిందన్న ప్రధాని షెహబాజ్

మోటార్‌ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల వ్యాన్‌పై కాల్పులు జరిపారు. ఈ దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. మనం తప్పు చేయకూడదు. ఉగ్రవాదం పాకిస్తాన్ యొక్క ప్రధాన సమస్యలలో ఒకటిగా కొనసాగుతోంది. మా సాయుధ దళాలు, పోలీసులకు ఇది శాపంగా మారుతుందని అన్నారు.

Pakistan PM Shehbaz Sharif: ఇన్నాళ్లకు బోధపడిందా! ఉగ్రవాదమే పాకిస్థాన్‌కు ప్రధాన సమస్యగా మారిందన్న ప్రధాని షెహబాజ్

Pakistan PM Shehbaz Sharif

Updated On : November 17, 2022 / 8:02 AM IST

Pakistan PM Shehbaz Sharif: పాకిస్థాన్ ఉగ్రవాద కేంద్రాలకు స్థావరంగా మారిందని ప్రపంచం మొత్తం చెబుతున్నా.. పాకిస్థాన్ లో ఉగ్రవాదులకు తావేలేదంటూ పాక్ ప్రభుత్వం బుకాయిస్తూ వస్తోంది. తాజాగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా పాక్ లో ఉగ్రవాదం వేళ్లూనుకుపోయిందని ఒప్పుకున్నాడు. పాకిస్థాన్ ప్రధాన సమస్యల్లో ఉగ్రవాదం ఒకటని అన్నాడు.

Pakistan PM Sharif: భారత్‌తో శాంతిని కోరుకుంటున్నాం.. యుఎన్‌జీఎలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన పాకిస్తాన్ ప్రధాని

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని లక్కీ మార్వాత్‌లో బుధవారం జరిగిన దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. మోటార్‌ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల వ్యాన్‌పై కాల్పులు జరిపారు. ఈ దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. మనం తప్పు చేయకూడదు. ఉగ్రవాదం పాకిస్తాన్ యొక్క ప్రధాన సమస్యలలో ఒకటిగా కొనసాగుతోంది. మా సాయుధ దళాలు, పోలీసులకు ఇది శాపంగా మారుతుందని అన్నారు. లక్కీ మార్వాట్‌లో పోలీసు వ్యాన్‌పై ఉగ్రవాదుల దాడిని ఖండించడానికి మాటలు సరిపోవు, నా ఆలోచనలు, ప్రార్థనలు మృతుల కుటుంబాలతో అని షరీఫ్ ట్వీట్ చేశారు.

లక్కీ మార్వాట్‌లో పోలీసు సిబ్బందిపై జరిగిన దాడిని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా ఖండించారు. ఈ ఘటనపై ప్రధాన కార్యదర్శి, ఐజీ ఖైబర్ పఖ్తుంఖ్వా నుంచి నివేదిక కోరినట్లు ఫెడరల్ మంత్రి తెలిపారు.