Princepal Singh : NBA టైటిల్ గెలిచిన టీమ్‌లో తొలి భారతీయుడిగా ప్రిన్సిపాల్ సింగ్

బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రిన్సిపాల్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఎన్బీయే టైటిల్ విన్నింగ్ టీమ్ లో అతడు సభ్యుడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా సింగ్

Princepal Singh : NBA టైటిల్ గెలిచిన టీమ్‌లో తొలి భారతీయుడిగా ప్రిన్సిపాల్ సింగ్

Princepal Singh

Updated On : August 19, 2021 / 8:00 PM IST

Princepal Singh : బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రిన్సిపాల్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఎన్బీయే టైటిల్ విన్నింగ్ టీమ్ లో అతడు సభ్యుడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా సింగ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. సాక్రామెంటో కింగ్స్ 2021 ఎన్బీయే(NBA) సమ్మర్ లీగ్ టైటిల్ విజేతగా నిలిచింది.

సింగ్ ది పంజాబ్ లోని గురుదాస్ పూర్. 6 అడుగుల 9 ఇంచుల పొడవు ఉంటాడు. ఎన్బీయేలోని అన్ని లెవెల్స్ లో టైటిల్ విజేతగా నిలిచిన టీమ్ లో భాగమైన తొలి ఇండియన్ ప్రిన్సిపాల్ సింగ్. బోస్టర్ సెల్టిక్స్ టీమ్ పై 100-67 తేడాతో కింగ్స్ టీమ్ ఘన విజయం సాధించింది. సమ్మర్ లీగ్ టైటిల్స్ ఎక్కువసార్లు గెలిచ్చిన ఫ్రాంచైజీగా కింగ్స్ గుర్తింపు పొందింది. 2014లో టైటిల్ గెలిచింది. చాంపియన్ షిప్ ఎంవీపీగా లూయిస్ కింగ్ పేరు ప్రతిపాదించారు. అతడు 21 పాయింట్లు స్కోర్ చేశాడు. ఫైనల్ లో ప్రిన్సిపాల్ సింగ్, ఎన్బీయే అకాడెమీ ఇండియా అల్యుమినీ.. గేమ్ చివరి నాలుగు నిమిషాలు ఆటలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ గేమ్ లో సింగ్ రెండు పాయింట్లు స్కోర్ చేశాడు.

నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్(ఎన్బీయే) నార్త్ అమెరికాలో ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ లీగ్. ఈ లీగ్ లో 30 టీమ్స్ ఉంటాయి. అమెరికా, కెనడాలోని నాలుగు ప్రధాన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్స్ లో ఎన్బీయే ఒకటి.