Vladimir Putin: మోదీ నిజమైన దేశ భక్తుడు.. ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

భారత ప్రధని నరేంద్ర మోదీ నిజమైన దేశభక్తుడని ప్రశంసించారు పుతిన్. మరోవైపు భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం చాలా గొప్పదన్నారు. దేశంలో అమలవుతున్న ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం గురించి కూడా పుతిన్ ప్రస్తావించారు.

Vladimir Putin: మోదీ నిజమైన దేశ భక్తుడు.. ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

Updated On : October 28, 2022 / 6:58 AM IST

Vladimir Putin: భారత ప్రధాని నరేంద్ర మోదీ నిజమైన దేశభక్తుడు అని ప్రశంసించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. భారత ప్రధాని అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానంతోపాటు ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాల్ని కూడా పుతిన్ ప్రశంసించారు.

Rohit Sharma: యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. అత్యధిక సిక్సర్లతో కొత్త రికార్డు

మాస్కోలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై స్పందించారు. ‘‘తన దేశం కోసం, ప్రజల కోసం స్వతంత్రంగా విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్న కొద్ది మంది ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన లక్ష్య సాధనలో ముందుకెళ్తున్నారు. ఇండియాలాంటి దేశాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేకాదు.. ప్రపంచ రాజకీయాల్లో ఇండియా కీలకపాత్ర పోషిస్తుంది. ఇండియాతో మాకు ఎలాంటి సమస్యా లేదు. అన్ని విషయాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాం. ప్రస్తుతం ఇదే జరుగుతోంది. భవిష్యత్తులో కూడా ఇదే సహకారం కొనసాగుతుంది. ప్రధాని మోదీ కోరినట్లుగా ఇండియాకు ఎరువుల సరఫరాను కూడా పెంచాం. ఇది ఇండియాలో వ్యవసాయ రంగ ప్రగతికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ACB Court : ఆ ముగ్గురు నిందితులను వెంటనే విడుదల చేయండి, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులకు ఏసీబీ కోర్టు షాక్

ప్రస్తుతం ఇండియాకు 7.6 రెట్లు అదనంగా ఎరువులు అందిస్తున్నాం’’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. మరోవైపు యుక్రెయిన్‌పై రష్యా అణుబాంబు ప్రయోగించే అవకాశాలు ఉన్నాయనే అంశంపై కూడా పుతిన్ స్పందించారు. ఆ అవసరం తమకు లేదన్నారు. అణ్వస్ర్తాలు వాడే ఉద్దేశం రష్యాకు లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలనే పాశ్చాత్య దేశాల వైఖరి చాలా ప్రమాదకరమని, దీన్ని ఎదుర్కోలేకపోతున్నామన్నారు.