Viral Video: జూ కీపర్ పై కొండచిలువ దాడి.

గుడ్లను ఇంక్యూబేటర్ లో పెట్టేందుకు తీస్తున్న సమయంలో ఈ పాము తనపై దాడి చేసినట్లు తెలిపాడు బ్రూవర్. ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు రోజులకే ఈ వీడియో 2 మిలియన్ వ్యూస్ రాగ, 1.4 లక్షల లైక్స్ వచ్చాయి.

Viral Video: జూ కీపర్ పై కొండచిలువ దాడి.

Viral Video (2)

Updated On : June 24, 2021 / 8:03 PM IST

Viral Video: జూలో కొండచిలువ గుడ్లు తీస్తుండగా ఓ వ్యక్తి వ్యక్తిపై దాడి చేసింది. దీంతో అతడికి రక్తపు గాయాలయ్యాయి. ఈ ఘటన కాలిఫోర్నియాలోని సరీసృపాల పార్క్ లో చోటుచేసుకుంది. పసుపు రంగులో నల్లటి చారలతో ఉన్న కొండచిలువ దగ్గరకు జూ కీపర్ జే. బ్రూవర్ వెళ్ళాడు. దాని గుడ్లను తీసే ప్రయత్నం చేశాడు. పాములను పట్టుకునే కర్రతో దానిని కంట్రోల్ చేసి దాని ధ్యాసను మళ్లించి గుడ్లు తీసుకోవాలని ప్రయత్నించాడు.

ఈ సమయంలో తన చేతిలోని స్టిక్ ను పక్కకు పెట్టి గుడ్లు తీస్తున్నాడు, గమనించిన కొండచిలువ ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. దీంతో అతడి ముఖంపై రక్తపు గాయాలయ్యాయి. కాగా ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుడ్లను ఇంక్యూబేటర్ లో పెట్టేందుకు తీస్తున్న సమయంలో ఈ పాము తనపై దాడి చేసినట్లు తెలిపాడు బ్రూవర్. ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు రోజులకే ఈ వీడియో 2 మిలియన్ వ్యూస్ రాగ, 1.4 లక్షల లైక్స్ వచ్చాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)