ఊపిరాడక శిశువు విలవిల.. ప్రాణం పోసిన పోలీసులు
అప్పటివరకూ తల్లి ఒడిలో పాలు తాగుతూ హాయిగా ఆడుకుంటున్న 21రోజుల శిశువు ఒక్కసారిగా ఊపిరి ఆడక విలవిల్లాడిపోయింది.

అప్పటివరకూ తల్లి ఒడిలో పాలు తాగుతూ హాయిగా ఆడుకుంటున్న 21రోజుల శిశువు ఒక్కసారిగా ఊపిరి ఆడక విలవిల్లాడిపోయింది.
అప్పటివరకూ తల్లి ఒడిలో పాలు తాగుతూ హాయిగా ఆడుకుంటున్న 21రోజుల శిశువు ఒక్కసారిగా ఊపిరి ఆడక విలవిల్లాడిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బిడ్డ పరిస్థితి చూసి షాకైన తల్లి గట్టిగా కేకలు వేసింది. పసికందు శరీరం నీలంరంగులోకి మారడంతో తల్లి కంగారుపడిపోయింది. ఏంచేయాలో అర్థం కాక సమీప పోలీసు స్టేషన్ కు పరిగెత్తింది. అప్రమత్తమైనన ఇద్దరు పోలీసు అధికారులు శిశువు ప్రాణం కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.
శిశువుకు ఊపిరి అందించేందుకు సీపీఆర్ చేశారు. పసికందు నోట్లో గాలి ఊదుతూ పాపకు శ్వాస అందించారు. కాసేపటికి శిశువు స్రృహలోకి రావడంతో తల్లి సహా అక్కడి పోలీసు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. బ్రెజిల్ లోని మరిలియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఇదంతా పోలీస్ స్టేషన్ లోని సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పసిబాలుడిని రక్షించిన పోలీసులను నెటిజన్లు హీరో కాప్స్ అంటూ అభినందిస్తున్నారు. ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ఈ వీడియోకు మూడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి.