రిపబ్లిక్ డే గిఫ్ట్ : నేపాల్‌కు బస్సులు..అంబులెన్స్‌లు

  • Published By: madhu ,Published On : January 26, 2019 / 12:16 PM IST
రిపబ్లిక్ డే గిఫ్ట్ : నేపాల్‌కు బస్సులు..అంబులెన్స్‌లు

ఖాట్మండు : 70వ రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశం..పొరుగున్న ఉన్న నేపాల్‌కు గిఫ్ట్ అందించింది. 30 అంబులెన్స్‌లు…6 బస్సులను అందిస్తున్నట్లు భారతదేశ ప్రకటించింది. జనవరి 26వ తేదీ ఇండియా రిపబ్లిక్ డే వేడుకలు ఖాట్మండులోని భారతీయ ఎంబసీ కార్యక్రమంలో ఘనంగా జరిగాయి. 

ఈ సందర్భంగా ఇండియా అంబాసిడర్ మంజీవ్ సింగ్ పూరి…బస్సులు..అంబులెన్స్‌లకు చెందిన తాళం చెవులను అక్కడి రాష్ట్ర ప్రతినిధులకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మంజీవ్ సింగ్ పూరి మాట్లాడుతూ…నేపాల్ రాష్ట్రానికి భారతదేశం సహాయ సహకారాలు అందించేందుకు ముందంజలో ఉంటుందని…నేపాల్..హ్యాపీ నేపాల్‌గా ఉండాలని దేశం కోరుకొంటోందని తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకలకు 2వేల మంది ప్రజలు పాల్గొన్నారు. 

1994 నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేపాల్‌కు 722 అంబులెన్స్‌లు, 142 బస్సులను అందచేసింది. రాష్ట్రంలో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదురు కావద్దని..విద్య విషయంలో ముందంజలో ఉండాలని భావిస్తూ భారతదేశం సహాయం చేస్తోంది.