Cancer Diagnosing New Device : క్యాన్సర్ ను నిర్ధారణ చేసే సరికొత్త పరికరం

క్యాన్సర్ ను గుర్తించే కొత్త పరికరాన్ని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. మనుషులు బాత్ రూమ్ లో కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో చేసే శబ్ధాలతో క్యాన్సర్ ను నిర్ధారించే కొత్త పరికరాన్ని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు.

Cancer Diagnosing New Device : క్యాన్సర్ ను నిర్ధారణ చేసే సరికొత్త పరికరం

diagnosing cancer

Updated On : December 5, 2022 / 7:05 AM IST

Cancer Diagnosing New Device : క్యాన్సర్ వ్యాధిని గుర్తించాలంటే బయాప్పీ పరీక్ష తప్పనిసరిగా చేయాల్సిందే. శరీరానికి కోత కంపల్సరీ. అయితే ఇవేమి లేకుండానే క్యాన్సర్ ను గుర్తించే కొత్త పరికరాన్ని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. మనుషులు బాత్ రూమ్ లో కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో చేసే శబ్ధాలతో క్యాన్సర్ ను నిర్ధారించే కొత్త పరికరాన్ని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు.

ఈ పరికరం అర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. దీనికి  సింథటిక్ హ్యూమన్ అకౌస్టిక్ రీ ప్రొడక్షన్ టెస్టింగ్ గా నామకరణం చేశారు. బాత్ రూమ్ లో మనుషులు చేసే మల, మూత్ర విసర్జన, ఆపానవాయువు శబ్ధాలను ఈ పరికరం రికార్డు చేసి, ఏఐ ఆధారంగా విశ్లేషిస్తుంది.

Cancer Diagnosis : క్యాన్సర్ నిర్ధారణకు మార్గాలివే!

మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ ను రూపొందించేందుకు పరిశోధకులు ఆరోగ్యకరమైన మనుషులు, క్యాన్సర్ రోగులు బాత్ రూమ్ లో చేసే మల, మూత్ర విసర్జన, ఆపానవాయువు శబ్ధాలను రికార్డు చేశారు. ఈ ఆడియో, వీడియో నమూనాలతో డాటాబేస్ ను రూపొందించారు.