ఫన్నీ రెస్టారెంట్ : పిచ్చి ప్రశ్నలేస్తే తినకపోయినా ‘బిల్’ కట్టాల్సిందే

  • Published By: veegamteam ,Published On : January 17, 2020 / 07:51 AM IST
ఫన్నీ రెస్టారెంట్ : పిచ్చి ప్రశ్నలేస్తే తినకపోయినా ‘బిల్’ కట్టాల్సిందే

Updated On : January 17, 2020 / 7:51 AM IST

ఏదైనా రెస్టారెంట్‌కు వెళామనుకోండి. చక్కగా మనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినాలి. అంతేగానీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయటం..తిక్క తిక్కగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే తినకపోయినా బిల్ కట్టాల్సిందే అనే రూల్ ఉందనుకోండి…ఏం చేస్తాం..నోరు అదుపులో పెట్టుకుని చక్కగా తిని అంతకంటే చక్కగా బిల్ కట్టి బైటకొచ్చేస్తాం.

అలా కాదు మానోటికి కాస్త దురద ఎక్కువ నా ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాను అనుకుంటే మాత్రం మీరు తిన్నా..తినకపోయినా బిల్ మాత్రం ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు ఓ రెస్టారెంట్ లో. మరి తిక్క తిక్క మాటలకు కూడా బిల్ వసూలు చేసే ఆ రెస్టారెంట్ గురించి తెలుసుకోండి..

అమెరికాలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లి..పిచ్చి పిచ్చి  ప్రశ్నలేస్తే.. రూ. 27 బిల్లు వేస్తారట..! విచిత్రమైన మెనూతో కస్టమర్లను ఆకట్టుకుంటూ..ఫుడ్ తో పాటు  ఫన్‌‌ను కూడా వడ్డిస్తుంటుంది  ‘టామ్స్ డైనర్’ అనే ఈ రెస్టారెంట్. ఇది అమెరికాలోని డెన్వర్ సిటీలో ఉంది. గత ఇరవై ఏళ్లుగా ఈ రెస్టారెంట్ పిచ్చి ప్రశ్నలకు బిల్లు వేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. 

ఈ రెస్టారెంట్ బిల్లును ఇటీవల ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా  వైరల్ అయ్యింది. ఆ బిల్లులో మ్యాష్డ్ పొటాటోస్ 2.99, చిక్ టెండర్స్ బాస్కెట్ 9, ఒక స్టుపిడ్ క్వశ్చన్‌‌కు 0.38 డాలర్ల (రూ.27) చొప్పున చార్జ్ చేసినట్లుగా ఉంది. అది చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. దాన్ని వైరల్ చేస్తున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే..బిల్లులో అయితే పెట్టారు గానీ, దానికి డబ్బులు మాత్రం వసూలు చేయరట. జస్ట్‌‌ ఫన్‌‌ కోసమే అలా బిల్లు వేస్తారట.