మగ బిడ్డ పుట్టాడు…ప్రిన్స్ హ్యారీ ప్రకటన

  • Published By: venkaiahnaidu ,Published On : May 6, 2019 / 02:57 PM IST
మగ బిడ్డ పుట్టాడు…ప్రిన్స్ హ్యారీ ప్రకటన

Updated On : May 6, 2019 / 2:57 PM IST

బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ,  మేఘన్‌ మార్కెల్‌ దంపతులకు తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ లభించింది.మార్కెల్‌ పురిటి నొప్పులతో సోమవారం తెల్లవారుఝామున ఆసుపత్రిలో చేరారని బకింగ్‌ హాం ప్యాలస్‌ సోమవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.అయితే సోమవారం(మే-6,2019) ఉదయం 05:26 గంటలకు (స్థానిక సమయం) మేఘన్ మార్కెల్ మగబిడ్డకు జన్మనిచ్చిందని ప్రిన్స్ హ్యారీ  ఇన్వె‌స్టా‍గ్రామ్‌ ద్వారా ఈ శుభవార్తను తెలిపారు. ఈ పోస్ట్‌ కు కేవలం 30 నిమిషాల్లోనే ఏడున్నర లక్షలకు పైగా లైక్‌ లు  రావడం విశేషం.చాలా థ్రిల్లింగ్ గా వుందనీ, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు హ్యారీ తెలిపారు. ఈ సందర్భంగా తమకు మద్దతు  అందించిన అందరికీ ప్రిన్స్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు,ప్రముఖులు హ్యారీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు  రాయల్‌ బేబీ ఫోటోను చూడడానికి ఈ రాజదంపతులు హితులు, సన్నిహితులతోపాటు  ప్రపంచవ్యాప్తంగా పలువురు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతేడాది మే-19,2019న బ్రిటన్‌లోని బెర్క్‌ షైర్‌ కౌంటీ విండ్సర్‌ లోని సెయింట్‌ జార్జి చర్చిలో హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.