Russia – Ukraine: యుక్రెయిన్ విధ్వంసకారులను హతమార్చమంటోన్న రష్యా
రష్యా భూభాగంపైకి చొరబడిని ఐదుగురు యుక్రెయిన్ విధ్వంసకారులను హతమార్చామని రష్యా ఆర్మీ చెబుతుంది. యూఎస్ అధికారుల అంచనా ప్రకారం..

Ukraine Tension Ukraine Soldier Killed In Clashes Near Russia Border
Russia – Ukraine: రష్యా భూభాగంపైకి చొరబడిని ఐదుగురు యుక్రెయిన్ విధ్వంసకారులను హతమార్చామని రష్యా ఆర్మీ చెబుతుంది. యూఎస్ అధికారుల అంచనా ప్రకారం… యుక్రెయిన్ ను రష్యా లక్షా 50వేల మందితో మొహరించింది. అది జనవరి 30తో పోలిస్తే లక్ష వరకూ పెరిగింది.
రష్యాతో సన్నిహఇత సంబంధాలున్న మాజీ సోవియట్ లో భాగమైన యుక్రెయన్‌ను నాటో సమ్మతించిందని పుతిన్ హామీ ఇస్తున్నారు. కాకపోతే దీనిని పాశ్చాత్య కూటమి ఖండిస్తుండగా రష్యాకు ముప్పు తప్పదనిపిస్తుంది. రష్యా మిలటరీ బలగాలు రక్తపాతానికి నాంది పలికితే యుక్రెయిన్ తూర్పు భాగంలో ఉన్న 14వేల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.
ఇదొక విపత్తులా మారనుందని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్విటెర్స్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యామ్నాయం లేకపోతే రష్యా – యుక్రెయిన్ ల మధ్య యుద్ధం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: యుక్రెయిన్ కు మరో టెన్షన్, హైపర్ సోనిక్ మిస్సైల్ ను పరీక్షించిన రష్యా
యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్… ఆస్టిన్ యుక్రెయిన్ లో అమెరికా దళాలు మోహరించడాన్ని తోసిపుచ్చారు. అదే నిజమని తేలితే సరిహద్దు దాటిన బలగాలు శిక్షార్హమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. Kyiv ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు వేగవంతంగా కదులుతున్నట్లు వెల్లడించారు.