Russia – UKraine War: మిగిలింది అణు బాంబుల దాడేనా.. ప్రపంచ వినాశనం తప్పదా

యుక్రెయిన్ విషయంలో మొదటినుంచీ తాను చేసిన ప్రతి ప్రకటనకూ విరుద్ధంగా వ్యవహరించిన పుతిన్ అణ్వాయుధాల ప్రయోగంలోనూ అలాగే చేయబోతున్నారా..? బెలారస్ అందుకే చరిత్రలో తొలిసారి తమ భూభాగంలో...

Russia – UKraine War: మిగిలింది అణు బాంబుల దాడేనా.. ప్రపంచ వినాశనం తప్పదా

Nuclear Weopan

Updated On : February 28, 2022 / 12:12 PM IST

Russia – UKraine War: ప్రపంచ వినాశనం తప్పదా..? ఇక రాబోతోంది అణుయుద్ధమేనా… రెండో ప్రపంచ యుద్ధాన్ని మించిన భయానక, బీతావహ దృశ్యాలకు యుక్రెయిన్ వేదిక కాబోతుందా..? మానవాళి చరిత్ర ఎరుగని మహా విషాదం ముంగిట నిల్చోనుందా..? రష్యా, యుక్రెయిన్ యుద్ధం అణుయుద్ధంగా మారబోతోందా..?

యుక్రెయిన్ విషయంలో మొదటినుంచీ తాను చేసిన ప్రతి ప్రకటనకూ విరుద్ధంగా వ్యవహరించిన పుతిన్ అణ్వాయుధాల ప్రయోగంలోనూ అలాగే చేయబోతున్నారా..? బెలారస్ అందుకే చరిత్రలో తొలిసారి తమ భూభాగంలో అణ్వాయుధాలకు అనుమతి ఇచ్చిందా..? యుక్రెయిన్ యుద్ధంలో తాజా పరిణామాలు గమనిస్తే…ఇదే అనిపిస్తోంది.

పుతిన్ న్యూక్లియర్ ఆయుధాల అలర్ట్ చేయడంతో ప్రపంచాన్ని అణ్వాయుధ యుద్ధ భయాలు కమ్ముకున్నాయి. పుతిన్ రక్షణ విభాగాలను అలర్ట్ చేయగానే యుక్రెయిన్ బెలారస్‌లో శాంతి చర్చలకు అంగీకరించింది. ఇది జరిగిన కొన్ని గంటలకే బెలారస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ భూభాగంలోకి అణ్వాయుధాలు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది.

Nuclear Weaponst

Nuclear Weaponst


యుక్రెయిన్‌ ఉత్తరంవైపు సరిహద్దులో ఉండే బెలారస్ నుంచి రష్యా అణ్వాయుధ దాడి చేసేందుకు ఇది వీలు కలిగిస్తుంది. పుతిన్ తాజా నిర్ణయంతో యుక్రెయిన్‌పై స్పెషల్ మిలటరీ ఆపరేషన్ వెనుక అణ్వస్త్ర వ్యూహం కూడా ఉందనే అనుమానం తలెత్తుతోంది.

యుద్ధం ప్రారంభించిన రోజే ప్రపంచ దేశాలకు తీవ్ర హెచ్చరికలు చేశారు పుతిన్. ఇతర దేశాలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే చరిత్రలో కనీవినీ ఎరుగని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

2014లో క్రిమియాను ఆక్రమించుకునే ఉద్దేశం లేదంటూనే ఆ ప్రాంతాన్ని రష్యాలో కలిపేసుకున్నారు. యుక్రెయిన్ వ్యవహారంలో తలదూర్చమని చెబుతూనే తూర్పు యుక్రెయిన్ ప్రాంతాలను స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నవాటిగా గుర్తించారు. యుక్రెయిన్‌పై యుద్ధం చేయనంటూనే దాడికి దిగారు. అలాగే అణ్వస్త్రాల ప్రయోగమూ ఉండొచ్చని భావిస్తున్నారు.