Russia ukraine war : రష్యా యుద్ధ ట్యాంక్ ను ఎత్తుకుపోయిన యుక్రెయిన్ రైతు…లబోదిబోమన్న రష్యన్
తమపై దాడులు చేయటానికి వచ్చిన రష్యా యుద్ధ ట్యాంక్ ను ఎత్తుకుపోయాడు యుక్రెయిన్ రైతు. అది గమనించిన రష్యన్ లబోదిబోమంటూ ట్రాక్టర్ వెనకాలే పరిగెత్తాడు.

Ukraine Farmer Steals Russian War Tank Using Tractor
Russia ukraine war : ఏడవరోజు కూడా యుక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రం చేస్తోంది. భారీ ఆయుధాలు, యుద్ధ ట్యాంకులతో రష్యా బలగాలు యుక్రెయిన్ నగరాల్లోకి దూసుకొస్తున్నాయి. ఆ యుద్ధ ట్యాంకులను అడ్డుకోవటానికి యుక్రెయిన్ పౌరులు శతవిధాల యత్నిస్తున్నారు. ‘శక్తి మేరకు ఎదిరించు కాకపోతే..చాకచక్యంగా అయినా శతృవుని బోల్తా కొట్టించు’అనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడో ఏమో గానీ యుక్రెయిన్ శతృదేశం రష్యాకు చెందిన ఓ యుద్ధ ట్యాంకునే ఎత్తుకెళ్లిపోయాడు. దీంతో ఓ రష్యన్ యుద్ధట్యాంకును తీసుకుపోతుంటే లబోదిబోమంటూ వెనకాల పరిగెడతున్నట్లుగా ఉంది వీడియోలో. ఏకంగా యుద్ధ ట్యాంకునే ఎత్తుకుపోయిన రైతుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
తమ దేశంపై దాడి చేసేందుకు రష్యా బలగాలు యుద్ధ ట్యాంకర్‌తో ఓ ప్రాంతానికి చేరుకున్నట్లు యుక్రెయిన్ రైతు తెలుసుకున్నాడు. ఏదోకటి చేయాలనుకున్నాడు. తన దగ్గర ఉన్న ట్రాక్టర్‌తో యుద్ధ ట్యాంకు ఉన్న చోటికి చేరుకున్నాడు. అంతే గుట్టుచప్పుడు కాకుండా తన ట్రాక్టర్‌కు ఆ యుద్ధ ట్యాంకర్‌ను అనుసంధానం చేసి అక్కడి నుంచి రయ్ మంటూ ట్రాక్టర్ పై దూసుకుపోయాడు.ఊహించని ఈ ఘటనకు బిత్తరపోయి వెంటనే తేరుకున్న రష్యా సైనికుడు ఆ ట్రాక్టర్ వెనుకాలే పరుగెత్తాడు.దీనికి సంబంధించినవీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తుల్లో బ్రిటీష్ ఎంపీ జానీ మెర్సర్ ఒకరు. తన ట్విట్టర్ లో ఈ వీడియోను షేర్ చేస్తూ..నిపుణులు కాకపోయినా రష్యన్ దండయాత్ర ప్రత్యేకంగా సాగుతున్నట్లు కనిపించటంలేదు.యుక్రెయిన్ వ్యక్తి రష్యన్ ఏపీసిని దొంగిలించింది అని పేర్కొన్నారు. ఈ వీడియో చూసినవారంతా ఓరినీ అసాథ్యం కూలా..దేశం కోసం ఏకంగా యుద్ధ ట్యాంకునే దొంగిలించాడే రైతు. భలే భలే ఐడియా అంటున్నారు ఈ వీడియో చూసినవారంతా.మరి మీరు కూడా ఓ లుక్ వేయిండీ ఈ రైతుగారి సాహసం వైపు..
No expert, but the invasion doesn’t seem to be going particularly well.
Ukrainian tractor steals Russian APC today ? pic.twitter.com/exutLiJc5v
— Johnny Mercer (@JohnnyMercerUK) February 27, 2022