Russian-Ukraine war : ఉక్రెయిన్ లో గుండెను మెలిపెట్టే దృశ్యం..కూతురిని పంపుతూ క‌న్నీరు పెట్టుకున్న తండ్రి

ఉక్రెయిన్ లో ఎక్కడచూసినా భావోద్వేగాన్ని కలిగించే దృశ్యాలే కనిపిస్తున్నాయి.యుద్ధం వేళ తన బిడ్డ అయినా సురక్షితంగా ఉండాలని ఓ తండ్రి ..కూతురిని పంపుతూ క‌న్నీరు పెట్టుకున్న వీడియో వైరల్

Russian-Ukraine war : ఉక్రెయిన్ లో గుండెను మెలిపెట్టే దృశ్యం..కూతురిని పంపుతూ క‌న్నీరు పెట్టుకున్న తండ్రి

Ukrain Video Goes Viral

Updated On : February 25, 2022 / 12:09 PM IST

ukrain video goes viral : రష్యా సైన్యం యుక్రెయిన్‌ని బాంబులతో అతలాకుతలం చేసి పారేస్తోంది. యుద్ధ విమానాల భీకర గర్జనలు..బాంబు పేలుళ్ల శబ్దాలకు యుక్రెయిన్ చిన్నారులు హడలిపోతున్నారు. ఈ క్రమంలో తాము ఏమైపోయినా ఫరవాలేదు తమ బిడ్డలైనా ప్రాణాలతో ఉండాలని తపన పడుతున్న తల్లిదండ్రలు పిల్లలను సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నారు. అలా ఓ తండ్రి తన బిడ్డను,భార్యను సురక్షిత ప్రాంతానికి తరలిస్తు బిడ్డను ముద్దు పెట్టుకుని కడివెడు కన్నీటితో పంపిస్తున్న దృశ్యం గుండెల్ని పిండేస్తోంది.

ఓ తండ్రి తన బిడ్డను మ‌రో ప్రాంతానికి పంపుతోన్న స‌మ‌యంలో ఆ తండ్రి గుండెకు హత్తుకొని క‌న్నీరు పెట్టుకున్నారు. హృద‌యాన్ని క‌లచి వేస్తోన్న ఈ వీడియో ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అవుతోంది. కూతురిని బస్సు ఎక్కించిన తండ్రి ఆమెను చూడ‌కుండా ఎలా ఉండ‌గ‌ల‌నోనంటూ బాధ‌ప‌డిన తీరు మనస్సుల్ని క‌దిలించివేస్తోంది. కుటుంబ స‌భ్యుల‌కు దూర‌మ‌వుతోన్న వారు ప‌డుతోన్న వేద‌న వ‌ర్ణ‌నాతీతంగా ఉంది.

రష్యా సేన దాడికి యుక్రెయిన్ విలవిల్లాడిపోతోంది. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో ప్ర‌జ‌లు నానా పాట్లు పడుతున్నారు. ఓ పక్క ప్రాణాలు కాపాడుకోవటానికి పోరాటం..మరోపక్క బతికి బట్టకడితే ఇంట్లో సరుకులు అయిపోతే ఎలా? ఏం తిని బతకాలి? అనే ఆందోళన. ఇంట‌ర్‌నెట్‌, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఏవీ కూడా స‌రిగ్గా ప‌ని చేయ‌కుండాపోవ‌డంతో ఆందోళ‌న చెందుతున్నారు. ఏటీఎం కార్డులు ప‌నిచేయ‌కుండా పోవ‌డంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇప్ప‌టికే కొన్ని ప్రాంతాల్లో సూప‌ర్ మార్కెట్ల‌కు ప్ర‌జ‌లు పోటెత్తారు. అందినకాడికి స‌రుకులు కొనుక్కుని వెళుతున్నారు. ఈ క్రమంలో ఎటునుంచి ఏ బాంబు వచ్చి మీద పడుతుందో..ప్రాణాలతో ఇంటికి వెళ్లగలమా? లేదా?అనే భయాందోళన.

యుద్ధ తీవ్రతకు ఇటువంటి ఎన్నో..ఎన్నెన్నో దృశ్యాలు అద్దం పడుతున్నాయి.ర‌ష్యా యుద్ధాన్ని ఆపేయాల‌ని..యుక్రెయిన్ నుంచి వెనక్కి మళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్తున్న ప్ర‌జ‌ల‌తో ప‌లు రహ‌దారులు నిండిపోతున్నాయి.